Eating Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు సరైన ఆహారం తీసుకోవాలి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా రైస్ తో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. అన్నంతో పాటు కూర, ఇతర ఆహార పదార్థాలను కలుపుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది విదేశీ సంస్కృతిని ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా అన్నంలో చేతితో కాకుండా స్పూన్ తో తింటున్నారు. దీనిపై కొందరిని అడిగితే పరిశుభ్రతను పాటించడం కోసమే చెంచాతో ఆహారం తింటున్నామని చెబుతున్నారు. అయితే చేతితో కాకుండా చెంచాతో తినడం వల్ల ఎలాంటి లాభం లేదని కొందరు సాంప్రదాయవాదులు అంటున్నారు. మరి చేతితో తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
పురాతన కాలం నుంచి అన్నంను చేతితోనే తింటూ వస్తున్నారు. చేతితో అన్నం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా అని కొందరు పెద్దలు చెబుతున్నారు. చేతితో అన్నం తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పడటానికి చేతితోనే ఆహారం తినాలని చెబుతుంటారు. చేతివేళ్లలో చివరగా ఉండే నరాలు మెదడుకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి అనే సంకేతాలు పంపుతాయి. మెదడు జీర్ణ వ్యవస్థ సిద్ధం చేసేందుకు తోడ్పడుతుంది. ఇలా చేతితో తినడం వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది.
చేతితో ఆహారం తినడం వల్ల మితంగా తినగలుగుతాం. మనం ఎంత ఆహారం తిన్నాం? ఇంకెంత తినాలి? అనే విషయాన్ని చేతికి ఉండే నరాలు మెదడుకు చేరవేరుస్తాయి. దీంతో అవసరం ఉన్నంతవరకు మాత్రమే ఆహారం తినగలుగుతాం. ఫలితంగా అదనపు ఆహారం తీసుకొని అవస్థలు పడాల్సిన అవసరం ఉండదు. చేతికి ఉన్న ఐదు వేళ్లను పంచభూతాలుగా పేర్కొంటారు. అందువల్ల చేతితో ఆహారం తీసుకోవడం వల్ల పంచభూతాలు అన్నీ కలిపి జీర్ణ వ్యవస్థను సక్రమంగా వస్తాయని చెబుతారు. చేతితో ఆహారం తినడం వల్ల అది ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంటే సాధారణ వేడితో ఉందా? లేదా ఎక్కువ వేడితో ఉందా? అనేది తెలుసుకొని చల్లారిన తర్వాత ఆహారాన్ని తీసుకోగలుగుతాం. లేకుంటే వేడి ఆహారం తినడం వల్ల పేగుల్లో సమస్యలు వస్తాయి.టైప్ టు డయాబెటిస్ ఉన్నవారు చేతితో ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవారు మితంగా ఆహారం తీసుకోవడం అవసరం. అది చేతితోనే అయితే సాధ్యమవుతుంది.
అయితే ప్రస్తుత కాలంలో చాలామంది స్పూన్తో ఆహారం తినడం అలవాటు చేసుకుంటున్నారు. చేతిలో ఒక్కోసారి పరిశుభ్రంగా ఉండవని.. స్పూన్ తో తినడం వల్ల శుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటామని చెబుతారు.స్పూన్ తో అయితే పరిమితికి మించి ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా స్పూన్ తో ఆహారం తినడం వల్ల మెదడుకు మెల్లగా సంకేతాలు వెళ్తాయి. దీంతో అధిక ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చి బరువు పెరుగుతారు.