ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా.. వీటితో ఆ ఆరోగ్య సమస్యలు..?

మనలో చాలామందికి ఎనర్జీ డ్రింక్ గురించి తెలిసే ఉంటుంది. ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల తక్షణమే సులభంగా శక్తిని పొందవచ్చు. సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే క్రీడాకారులు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతూ ఉంటారు. అయితే ఎనర్జీ డ్రింక్స్ పరిమితంగా తీసుకుంటే సమస్య లేదు కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే వాటికి అడిక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడిస్తున్నారు. […]

Written By: Navya, Updated On : జనవరి 12, 2021 6:05 సా.
Follow us on

మనలో చాలామందికి ఎనర్జీ డ్రింక్ గురించి తెలిసే ఉంటుంది. ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల తక్షణమే సులభంగా శక్తిని పొందవచ్చు. సాధారణ వ్యక్తులతో పోల్చి చూస్తే క్రీడాకారులు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతూ ఉంటారు. అయితే ఎనర్జీ డ్రింక్స్ పరిమితంగా తీసుకుంటే సమస్య లేదు కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగితే వాటికి అడిక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడిస్తున్నారు.

Also Read: గాలిపటాలు ఎగిరేస్తున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

ఎనర్జీ డ్రింక్స్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్‌ ఉంటాయని ఇవి వీటికి అడిక్ట్ కావడానికి కారణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎనర్జీ డ్రింక్స్ కు అడిక్ట్ అయిన వారిలో ఎనర్జీ డ్రింక్స్ గురించి ఆలోచనలు ఉండటంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ తాగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ డ్రింక్స్ తాగని సమయంలో తలనొప్పి, అలసట లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే ఎనర్జీ డ్రింక్స్ కు అడిక్ట్ అయ్యామని గుర్తుంచుకోవాలి.

Also Read: పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర, ఆయుర్వేదా మూలికా గుణాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే చక్కెర, కెఫిన్ శరీరంపై దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ చిగుళ్లపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి బరువు పెరగడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇప్పటికే ఎనర్జీ డ్రింక్స్ కు అడిక్ట్ అయితే ఒకేసారి ఎనర్జీ డ్రింక్స్ ను తాగడం మానేయకుండా క్రమంగా మానేయాలి. ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యల బారిన పడినట్లు గుర్తిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. ఎనర్జీ డ్రింక్స్ కు బదులుగా కాఫీ, పండ్ల రసాలను తీసుకుంటే మంచిది.