కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతేడాది రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లతో పాటు ఇళ్ల ధరలు సైతం తగ్గాయి. అయితే గడిచిన నెల రోజుల నుంచి పరిస్థితులు మారడంతో పాటు ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ప్రాప్ టైగర్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా పెరగడం గమనార్హం. హైదరాబాద్ నగరంతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది.
Also Read: సంక్రాంతి జర్నీ భారం.. ‘ప్రైవేటు’ బాదుడుతో పండుగ కష్టాలు
పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ ఉండటంతో చాలామంది రుణాలు తీసుకొని ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు కొత్తగా ఇళ్ల నిర్మాణాలు కూడా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. కొనుగోళ్లతో పాటు అమ్మకాలు కూడా హైదరాబాద్ నగరంలోనే గతంతో పోల్చి చూస్తే భారీగా పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.
Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో కిలో చికెన్ ఎంతంటే..?
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని 12,723 కొత్త ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. 2020 సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో ఎక్కువ ప్రాజెక్టులు అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు అని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మిగతా నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గుతుంటే హైదరాబాద్ నగరంలో మాత్రం ధరలు పెరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఆమోదయోగ్యమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుందని అందువల్లే ఈ నగరంలో అమ్మకాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది.