Horoscope Mahashivarathri :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న శుక్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు మీన రాశిలోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ కారణంగా ఆరు రాశుల్లో అనూహ్య మార్పులు రానున్నాయి. ఈ రాశుల వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరగనున్నాయి. కొన్ని రాశుల వారికి ఆకస్మిక ఆదాయం సమకూరుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..
మహా శివరాత్రి సందర్భంగా గ్రహాల కలయిక ప్రభావం మేష రాశిపై ఉండనుంది. ఈ రాశి వారి జీవితంలో శివరాత్రి నుంచి అనేక మర్పులు చోటు చేసుకోనున్నాయి. మహా శివరాత్రి నుంచి వీరి సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధనయోగం ఉంటుంది. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి టుంది. గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశిపై కూడా ప్రభావం ఉండనుంది. ఈ రాశి కలిగిన ఉద్యోగులు కొత్త ఆఫర్లు పొందుతారు. కొందరు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అనుకోని విధంగా లాభాలు వస్తాయి.
మిథున రాశి వారికి శివరాత్రి నుంచి మహర్దశ ఉండనుంది. విదేశాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు. వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తులు సమకూరుతాయి. ఇదే ప్రభావం తుల రాశిపై పడనుంది. తులా రాశివారికి లాభదాయక పరిచయాలు ఉంటాయి. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఏ రంగంలోవారికైనా ఆశించిన కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.
గ్రహాల మార్పు కారణంగా మకర రాశివారికి రాజయోగం కలగనుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకం ఉంటుంది. ఊహించని స్థాయిలో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అదృష్ట యోగం కలగనుంది. కుంభ రాశివారి వ్యాపారులకు లాభాలు అధికంగా ఉంటాయి. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆన్ లైన్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రయోజనకంగా ఉంటుంది.