ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠ

సెప్టెంబర్ 7నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈనేపథ్యంలోనే మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవీని ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. Also Read: ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు? తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 3:53 pm
Follow us on


సెప్టెంబర్ 7నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈనేపథ్యంలోనే మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవీని ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Also Read: ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం ఇటీవలే ముగిసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ను వీడటంతో ఆయనపై అనర్హత వేటుపడింది. ఇటీవలే ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలం ముగిసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ మూడు స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ దక్కుతుందా? లేక పాతవారినే రెన్యూవల్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ మూడుస్థానాల కోసం టీఆర్ఎస్ నేతల్లో పోటీతీవ్రంగా ఉంది. మూడు స్థానాలకు దాదాపు 30మంది నేతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ ముగ్గురి పేర్లను ఖారారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో కర్నె ప్రభాకర్ కు మరోసారి రెన్యూవల్ చేస్తారనే టాక్ విన్పిస్తోంది. ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నేతలు ఎమ్మెల్సీ పదవీని ఆశిస్తున్నారు. వీరిలో ఒకరికి పదవీ దక్కే అవకాశం ఉంది. అయితే తుమ్మలకే ఆ ఛాన్స్ దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ మరోసారి నాయినికి ఛాన్స్ ఇస్తారా? లేదా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యాక నాయినికి హోంమంత్రి పదవీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక నాయినికి ఎలాంటి పదవీ దక్కేలేదు. గత ఎన్నికల్లో నాయిని తన అల్లుడికి టీఆర్ఎస్ సీటు అడిగినా ఇవ్వలేదు. దీంతో నాటి నుంచి నాయిని టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నాడు. అలాగే నాయిని రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించినా కేసీఆర్ ఆయనను కరుణించలేదు.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

దీంతో మరోసారి నాయిని రెన్యూవల్ చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ రానుండటంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. కాగా సీఎం కేసీఆర్ ఇప్పటికే ముగ్గురిని ఫైనల్ చేశారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఆ ముగ్గురు ఎవరై ఉంటారనేది టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.