Honey: తేనెతో ఈ పదార్థాలు కలుపుతున్నారా.. అయితే ఆరోగ్యం డేంజర్‌లో పడినట్లే!

తేనె ఆరోగ్యానికి మంచిదైనా కూడా కొన్ని పదార్థాలతో కలపకూడదు. కొందరు తెలియక కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. సహజ స్వీటెనర్ అయిన తేనను మరి ఏయే పదార్థాలతో కలిపి వాడకూడదో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 12, 2024 4:21 pm

Honey

Follow us on

Honey: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఉదయం నిమ్మరసంలో వేసి తాగితే డే అంతా యాక్టివ్‌గా ఉంటారని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎక్కువగా వాకింగ్, రన్నింగ్‌కి వెళ్లేవారు ఈ నీటిని తాగుతారు. అయితే తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికాల్స్‌తో పోరాడే శక్తి ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు రాకుండా కాపాడటంతో సహాయపడుతుంది. అలాగే తేనె యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో గాయాలను కూడా తొలగించవచ్చు. అయితే తేనె ఆరోగ్యానికి మంచిదైనా కూడా కొన్ని పదార్థాలతో కలపకూడదు. కొందరు తెలియక కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. సహజ స్వీటెనర్ అయిన తేనను మరి ఏయే పదార్థాలతో కలిపి వాడకూడదో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వేడి ద్రవాలతో కలపకూడదు
తేనెను వేడి నీరు లేదా ద్రవాలతో కలపకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తేనెలో ఉండే ఎంజైమ్‌లను అధిక ఉష్ణోగ్రతలు నాశనం చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చల్లని పానీయాలతో తేనెను తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో చక్కెరలు ఉంటాయి. తేనెను వేడి చేయడం వల్ల ఇవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయట. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెల్లుల్లితో కలపవద్దు
చైనీస్ పదార్థాలు, వెల్లుల్లి వంటి వాటితో తేనెను కలపకూడదు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కలిపి చేసిన పదార్థాలను తినడం కూడా ఆరోగ్యానికి లేని పోని సమస్యలను తెచ్చిపెడుతందట.

దోసకాయ
బాడీని చలవ చేయడంలో దోసకాయ బాగా ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. అయితే దోసకాయను తేనెతో కలపడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం అనుకూల కంటే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే వీటిని కలిపి తింటే జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పాల ఉత్పత్తులతో వద్దు..
తేనెను పాల ఉత్పత్తులతో అసలు తీసుకోవద్దు. ముఖ్యంగా వేడిపాలతో అయితే అసలు తీసుకోవద్దు. వేడి పాలతో కలిపి తేనెను తీసుకోవడం వల్ల రెండింటిలో ఉన్న పోషకాలు విషంగా మారతాయి. దీనివల్ల కడుపు నొప్పి, అజీర్ణం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సిట్రస్ పండ్లతో..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సిట్రస్ పండ్లతో తేనెను కలపకూడదు. వీటితో తేనె కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల బాడీలో చాలా మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదార్థాలతో తేనెను అసలు కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల కొత్తగా అనారోగ్య సమస్యలను మీరే సృష్టించుకున్నవారు అవుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు