https://oktelugu.com/

వెన్న తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా…?

దేశంలో గతంతో పోలిస్తే వెన్న వినియోగం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇతర ఆహారాలతో పోలిస్తే వెన్న ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. వెన్న తినడం ద్వారా విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె2 లభిస్తాయి. కాల్షియం, ఐరన్ కూడా ఉన్న వెన్న ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. వెన్న శరీరంలోని ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. Also Read: ఏసీ వాడుతున్నారా.. విద్యుత్ బిల్లు ఆదా చేసే చిట్కాలివే..? […]

Written By: , Updated On : March 26, 2021 / 08:15 PM IST
Follow us on

Homemade Butter

దేశంలో గతంతో పోలిస్తే వెన్న వినియోగం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇతర ఆహారాలతో పోలిస్తే వెన్న ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పవచ్చు. వెన్న తినడం ద్వారా విటమిన్‌ ఏ, విటమిన్‌ డి, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె2 లభిస్తాయి. కాల్షియం, ఐరన్ కూడా ఉన్న వెన్న ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. వెన్న శరీరంలోని ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Also Read: ఏసీ వాడుతున్నారా.. విద్యుత్ బిల్లు ఆదా చేసే చిట్కాలివే..?

వెన్న గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంతో పాటు కంటి సమస్యలను దూరం చేస్తుంది. వెన్నలోని కొలెస్ట్రాల్ నరాల బలానికి, మెదడు పెరుగుదలకు తోడ్పడుతుంది. డైట్ లో ఉన్నవాళ్లు తరచూ వెన్నను తీసుకుంటే మంచిది. వెన్న జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. మహిళలలో సంతానసాఫల్య అవకాశాలను పెంపొందించడంలో వెన్న ఉపయోగపడుతుంది.

Also Read: ఎత్తు పెరగాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలు ఇవే..?

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వెన్నను తీసుకుంటే రక్త సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రోజూ ఉదయం సమయంలో వెన్న తింటే శరీరంలో చెడు పదార్థాలు తొలగిపోతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో వెన్న సహాయపడుతుంది. వెన్నలో శరీరానికి అవసరమైన బ్యుటిరేట్, కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలు ఉన్నాయి. వెన్నలో ఉండే బ్యుటిరేట్ మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడుతుంది.

జీవక్రియలకు అవసరమైన శక్తిని సమకూర్చడంలో వెన్న సహాయపడుతుంది. మనం తిన్న ఆహారం శరీరానికి పట్టేలా చేయడంలో వెన్న తోడ్పడుతుంది. చిన్న పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో బ్యుటరేట్ సహాయపడుతుంది.