https://oktelugu.com/

వైల్డ్ డాగ్ టీజర్ ప్రోమో: వేటాడడమే నాగార్జున టార్గెట్

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున ఈసారి సీరియస్ కథాంశంతో మనముందుకు వస్తున్నారు. ‘వైల్డ్ డాగ్’ పేరుతో యాక్షన్ ఎంటర్ టైనర్ తీస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీస్తుకొస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దియామీర్జా హీరోయిన్. తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబడిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ […]

Written By: , Updated On : March 26, 2021 / 07:58 PM IST
Follow us on

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున ఈసారి సీరియస్ కథాంశంతో మనముందుకు వస్తున్నారు. ‘వైల్డ్ డాగ్’ పేరుతో యాక్షన్ ఎంటర్ టైనర్ తీస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీస్తుకొస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దియామీర్జా హీరోయిన్.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయబడిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ‘వైల్డ్ డాగ్’ టీజర్ ప్రోమోను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.

దేశంలో ఎంతో మంది తీవ్రవాదులను బ్లాక్ మెయిల్ చేస్తే వదిలేశారని.. కాందహార్ లో మన విమానాన్ని హైజాగ్ చేసినందుకు ముగ్గురు టెర్రరిస్టులను రిలీజ్ చేశారని.. వాళ్లలో ఒకడు మసూద్ అజహార్ వల్ల ముంబై దాడులు జరిగి 174 మంది చనిపోయారని ’ నాగార్జున ఆవేశంగా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దేశంలో భయంతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి కోసం తాను టెర్రరిస్టులను వేటాడుతూనే ఉంటానని డైలాగులో స్పష్టం చేశాడు.

‘వైల్డ్ డాగ్’ మూవీలో హైదరాబాద్ లో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్.. దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల వెనుకున్న ప్రధానసూత్రధారులను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీం కథను చూపించబోతున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల సందర్భంగా తాజాగా సరికొత్త టీజర్ ప్రోమోను విడుదల చేశారు.

I'm Not Ok With That | Wild Dog on 2 Apr | Teaser Promo | Akkineni Nagarjuna | Ahishor Solomon