Home Cook Tips:ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండుకునే ఈ ఆహారం నాణ్యమనదిగా ఉండేలా చూసుకోవాలి. ఒకప్పుడు మట్టి పాత్రల్లో అన్నం, కూరతో పాటు వివిధ రకాల వంటలు చేసుకునేవారు. వీటిలో వండిన వాటిని తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. రాను రాను పాత్రల వాడకం మారిపోయింది. ప్రస్తుతం స్టీల్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే కొన్ని వంటకాల కోసం ప్రత్యేకంగా ఐరన్ పాత్రలను యూజ్ చేస్తున్నాయి. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తో పాటు ఫ్రై ఫుడ్ చేసుకోవడానికి ఐరన్ కడాయిని వాడుతుంటారు. ఇందులో వండిన వాటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. కానీ కొన్ని వంటకాలు మాత్రం అంత ప్రయోజనం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐరన్ కడాయిలో చేసిన వంటలు తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అందువల్ల చాలా మంది వీటికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొన్ని వంటలు మాత్రం ప్రయోజనానికి బదులు నష్టాన్ని చేకూరుస్తాయి. వాటిలో అన్నం ఒకటి. అన్నంను ఐరన్ కడాయిలో వండడం వల్ల దీని నేచురాలిటీ కోల్పోతుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు కోల్పోతాయి. అంతేకాకుండా అన్నం రుచి మారుతుంది. ఐరన్ కడాయిలో టామోటా లేకుండా చూసుకోవాలి. టమాటాలో యాసిడ్ నేచుర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఐరన్ కడాయిలో వండడం వల్ల కర్రీ రుచి మారిపోతుంది.
బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు. దీనిని నేరుగా తినొచ్చు. కర్రీగా వండుకోవచ్చు. అయితే బీట్ రూట్ ను ఐరన్ కడాయిలో వండొద్దు. బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఐరన్ కడాయిలో వండడం వల్ల రియాక్టయి రంగు మారిపోతుంది. నేటికాలంలో పాస్తా తినడం ఫ్యాషన్ గా మారింది. అయితే దీనిని ఐరన్ కడాయిలో వండడం వల్ల రియాక్టయి టేస్ట్ కోల్పోతుంది. చేపల్లో ఐరన్ తో పాటు యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఐరన్ కడాయిలో వండడం వల్ల కడాయికి అతుక్కుపోతాయి.
శనగపిండి, పెరుగుతో కలిపి కదిని తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచింది. దీనిని ఐరన్ పాత్రలో చేయడం వల్ల రుచిని కోల్పోతుంది. ఆకుకూరల్లో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఐరన్ కడాయిలో వండడం వల్ రియాక్టయి రుచి మారుతుంది. దీంతో నిరాశ చెందుతారు. నిమ్మకాయలతో సంబందం ఉన్న పులిహోర వంటి పదార్థాలు సైతం ఐరన్ కడాయిలో చేయడం మానుకోవాలి. నిమ్మలో ఉండే గుణాలు ఐరన్ తో రియాక్టయి టేస్ట్ మారుతుంది.