Horoscope On Ugadi: ఆరు రుచుల సమ్మేళనంతో జరుపుకునే పండుగ ఉగాది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందువల్ల చాలా మంది వ్యాపారులు కొత్త పనులను ఇప్పటి నుంచే మొదలు పెడుతారు. కొందరు దుకాణస్తులు తమ అకౌంట్ ను ఇప్పటి నుంచి రీఫ్రెష్ చేస్తారు. ఉగాది అనగానే తీపి,చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు తో కూడిన ఉగాది పచ్చడి.. బొబ్బట్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఉదయం పండుగను వైభవంగా జరుపుకొని సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తారు. వచ్చే ఏడాదితో తమ భవిష్యత్ ఎలా ఉంటుందో పంచాంగం ద్వారా తెలుసుకుంటారు.
ప్రతీ ఉగాదికి కొత్త పంచాంగం ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు రోజులు ఎలా గడిచినా ఇక నుంచి ఎలా ఉండబోతుంది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలో కొందరు తమ రాశి ప్రకారం జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. 2024 మార్చి 9న ఉగాది రాబోతుంది. ఈ ఏడాదిని క్రోది నామసంవత్సరంగా పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాదికి సంబంధించిన పంచాంగం ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ పంచాంగ ప్రకారం ఓ రాశి వారికి మహా యోగం ఉన్నట్లు తెలుస్తోంది.
పంచాంగ శ్రవణం ప్రకారం తులా రాశి వారికి ఈ ఏడాది మహా యోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ పూజ్యం 1, అవమానం 5 ఉన్నాయి. వీరు ఇప్పటి నుంచి అనుకున్న పనిని నెరవేరుస్తారు. స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ఎన్నో నిందలు భరించాల్సి వస్తుంది. కానీ వాటిని అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులు పదోన్నతులతో పాటు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.రాజకీయాల్లో ఉన్నవారికి సైతం అనుకూలమైన వాతావరణం ఉంది.
అయితే ఈ రాశివారికి అష్టమంలో గురు సంచారం ఉంటుంది. దీంతో కుటుంబంలో సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విద్యార్థులు కెరీర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి అడ్డంకులు ఏర్పడుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కాస్త ప్రతికూల వాతావరణమే ఉంటుంది. అయితే వారి జాతకాల ప్రకారం పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.