Health Tips: ఇతర కాలాలతో పోల్చి చూస్తే వేసవికాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలో ఎక్కువ సమయం పని చేయడం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వేసవికాలంలో చాలామందిని చర్మసంబంధిత సమస్యలు వేధిస్తాయి.
వేసవికాలంలో గొడుగును వాడటం వల్ల ఎండ నుంచి మనల్ని మనం సులువుగా రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వేసవిలో ఎక్కడికి వెళ్లినా మనతో పాటు వాటర్ బాటిల్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవికాలంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎండ నుంచి ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
వేసవికాలంలో రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. వేసవికాలంలో ఆభరణాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. వేసవిలో ఏదైనా ఆరోగ్య సమస్య వేధిస్తే వైద్యులను సంప్రదించి మందులు వాడటం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.