Maha Dharna: టీఆర్ఎస్ నేతలు బీజేపీపై పోరుబాట ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా వరిధాన్యం కొనుగోలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు ఢిల్లికి కదిలారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి ధాన్యం కొనుగోలు చేసేలా చేయాలని భావిస్తోంది. తెలంగాణ ఉద్యమం తరువాత ఢిల్లీ వేదికగా ఉద్యమం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో గులాబీ నేతలు బీజేపీపై యుద్ధం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీని కోసమే సోమవారం ఆందోళన చేసేందుకు సిద్ధమైంది.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని దాదాపు 1500 మంది టీఆర్ఎస్ నేతలు ధర్నాలో పాల్గొనేందుకు ఢి్ల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో పోరాటానికే సిద్ధమై ధర్నా నిర్వహించేందుకు ముందుకొచ్చారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేలా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సహా పలువురు దీక్షలో పాల్గొననున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై గళం వినిపనించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: ఢిల్లీలో కేసీఆర్ వెంట కవిత.. ఆ బాధ్యతలు ఆమెకేనా?
జాతీయ స్థాయిలో ధాన్యం కొనుగోలు అంశాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ మేరకు ధర్నాకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతు సంఘాలకు సైతం సమాచారం ఇచ్చి వారు పాల్గొనాలని కోరారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతుందని కేసీఆర్ వ్యూహం. దీని కోసమే ఆయన చక్రం తిప్పాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. దీనికి ఎంత దాకా అయినా వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
కేంద్రం తీరుపై పల్లె నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం మనుగడ సాధించడం కష్టమని చెబుతూ ఆందోళన బాట పట్టనుంది. ధాన్యం సేకరణ అంశాన్ని సాకుగా చూపి జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెంచుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రైతుల ధాన్యం ప్రతి గింజ కొనే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. ఇక బీజేపీపై పోరాటం చేసేందుకు అన్ని మార్గాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: భదాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీరామ కల్యాణం