https://oktelugu.com/

Roja Dream: రోజా కల నెరవేరింది.. ఇక సినిమాలు, జబర్ధస్త్ కు గుడ్ బై..!

Roja Dream Come True: రాజకీయాల్లో ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న ఎమ్మెల్యే రోజా నేడు అందరితో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రోజా ఏపీ కొత్త క్యాబినేట్లో చోటు దక్కించుకున్నారు. వైసీపీలో మంత్రి పదవీ కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఈసారి కూడా రోజాకు మొండిచేయి దక్కవచ్చని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రోజాకు మహిళా కోటాలో మంత్రి పదవీ కేటాయించడంతో ఆమె చిరకాల వాంఛ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2022 / 10:35 AM IST
    Follow us on

    Roja Dream Come True: రాజకీయాల్లో ఐరన్ లెగ్ గా పిలిపించుకున్న ఎమ్మెల్యే రోజా నేడు అందరితో గోల్డెన్ లెగ్ అనిపించుకున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రోజా ఏపీ కొత్త క్యాబినేట్లో చోటు దక్కించుకున్నారు. వైసీపీలో మంత్రి పదవీ కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఈసారి కూడా రోజాకు మొండిచేయి దక్కవచ్చని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రోజాకు మహిళా కోటాలో మంత్రి పదవీ కేటాయించడంతో ఆమె చిరకాల వాంఛ నెరవేరినట్లయింది.

    MLA Roja and Jagan

    సినీ నటిగా రోజాకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇమేజ్ తోనే ఆమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో ఆమె రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. తన కంచు కంఠం, సైటర్లతో ప్రత్యర్థి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడంతో రోజాకు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పేరొచ్చింది.

    అయితే టీడీపీలో సొంత పార్టీ నేతలే ఆమెను పొమ్మనలేక పొగబెట్టారు. ఈక్రమంలోనే ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. రెండు సార్లు వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో తొలి క్యాబినేట్లోనే రోజాకు మంత్రి పదవీ దక్కుతుందని అంతా భావించారు.

    అయితే కుల సమీకరణాల్లో భాగంగా రోజాకు నాడు మంత్రి పదవీ దక్కింది. దీంతో ఆమె కొంత అలకబునారు. ఈక్రమంలోనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవీని జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారు. అయితే కొన్నాళ్లకే ఆ పదవీ నుంచి ఆమెను తప్పించారు. నాటి నుంచి రోజా కొంత సైలంటయ్యారు. ఎప్పటిలాగే సినిమాలు, జబర్దస్త్ షోలను చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

    ఈక్రమంలోనే రోజాకు రెండోసారి క్యాబినేట్లో పోస్టు దక్కుతుందా? లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మంత్రి పదవీ కోసం వైసీపీలో తీవ్ర పోటీ ఉండటంతో రోజాకు మంత్రి పదవీ కష్టమేనన్న ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నగరి ఎమ్మెల్యే రోజా జగన్ క్యాబినెట్లో పదవీని దక్కించుకున్నారు.

    తనకు మంత్రి పదవీ దక్కడంపై ఆర్కే రోజా తాజాగా స్పందించారు. తనను అసెంబ్లీ అడుగు పెట్టనీవ్వకుండా చంద్రబాబు నాయుడు చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తనను రెండుసార్లు ఎమ్మెల్యే చేసి ఇప్పుడు మంత్రి కూడా చేస్తున్నారన్నారు.

    మహిళా పక్షపాతి అయిన సీఎం క్యాబినేట్లో తాను మంత్రిగా చేయనుండటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇకపై తాను సినిమాలు, జబర్దస్త్ షోలకు దూరంగా ఉంటానని రోజా క్లారిటీ ఇచ్చారు. ఏదిఏమైనా మంత్రి కావాలనే రోజా చిరకాల కల నెరవడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.