Heart Attack Causes: మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. ఒకరోజు ప్రోటీన్లతో కలిగిన ఆహారం తినగలిగినా.. ఆరోగ్యకరమైన నిద్ర లేకపోతే అది వ్యర్థమే అవుతుంది. సరైన ఆహారంతోపాటు కంటినిండా నిద్ర ఉంటేనే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అయితే ఇటీవల తేలిన కొన్ని పరిశోధనల ప్రకారం నిద్రలేని వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. అసలు నిద్రకు, గుండెకు ఇలాంటి సంబంధం ఉంటుంది? సరే నేను నిద్ర పోకపోతే హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?
కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ప్రతి వ్యక్తి కనీసం 8 గంటల పాటు నిద్ర పోవాలి. ఈ ఎనిమిది గంటలకు కూడా నాణ్యమైన నిద్ర ఉండాలి. నాణ్యమైన నిద్ర అంటే కొందరు కళ్ళు మూసుకుంటారు.. కానీ లోపల ఏవేవో ఆలోచనలు ఉంటాయి. అలాగే కొందరు నిద్రపోయినా కూడా పీడ కలలు వస్తూ ఉంటాయి. ఇలా నిద్రపోయిన వారి మనసు ఆందోళనగా ఉంటుంది. అంటే వారు నాణ్యమైన నిద్ర పోనట్లే. అయితే ఈ క్వాలిటీ లెస్ నిద్ర రావడానికి మనం చేస్తున్న తప్పులే. ప్రతిరోజు నిద్రించే ముందు అదే పనిగా ఫోన్ చూడడం.. టీవీ చూస్తూ ఉండిపోవడం.. ఆల్కహాల్ లేదా సమయం దాటిన తర్వాత బిర్యానీలు తినడం వల్ల ఇలాంటి కలత నిద్రలు వస్తూ ఉంటాయి. ఈ నిద్ర వల్ల ఆరోగ్యానికి నష్టమే ఉంటుంది.
అయితే నాణ్యమైన నిద్ర రావాలంటే పడుకునే కనీసం 30 నిమిషాల ముందు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి.ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మనసు నార్మల్ స్టేజ్ కి వస్తుంది. ఇది ఒకేసారి అలవాటు కాకపోవచ్చు. కానీ మెల్లిగా ఈ వైపు ప్రయత్నం చేయాలి. అప్పుడు నాణ్యమైన నిద్ర పడుతుంది. సరైన ఆహారంతో పాటు కంటినిండా నిద్ర పోవడం వల్ల ఉత్సాహంగా ఉండడంతో పాటు నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
మరి నిద్ర కరువైతే గుండెకు సమస్యలు ఎలా వస్తాయి అన్న సందేహం చాలా మందికి ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ నార్మల్గా ఉంటుంది. అదే ఆందోళనగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. అంటే ఈ సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ మనసు ఆందోళనగా ఉండే సమయంలో హార్ట్ బీట్ అసమతుల్యంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉండడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉండదు. ఫలితంగా గుండె ఇతర అవయవాలకు రక్త పంపిణీ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా కొందరు రాత్రి సమయంలో భోజనం చేసి వెంటనే పడుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల ఆహారం జీర్ణమయ్యే అవకాశం ఉండదు. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె సమస్యలు వస్తాయి. ఈ విధంగా నిద్ర లేకపోవడం వల్ల హాట్ ఎటాక్ సమస్యలు ఎక్కువే అంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల ప్రతిరోజు నాణ్యమైన నిద్రపోయే ప్రయత్నం చేయాలి.