Heart Attack: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పరిశుభ్రత వల్ల కొన్ని రోగాలను దరిచేరకుండా చేయవచ్చని పేర్కొంటారు. అయితే మానవ శరీరంలోని ఒక అవయవం మరొక ఆర్గాన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవయవాలు దూరంగా ఉన్న ఏదోరకంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుంది. అందువల్ల శరీరంలోని ప్రతి ఒక్క అవయవం ప్రధానమే అని భావించి ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడం సాధారణమైన విధి. కానీ కొందరు సరిగ్గా బ్రష్ చేసుకోక దంతా క్షయం బారిన పడతారు. అంతేకాకుండా రోజుకు ఒకేసారి బ్రష్ చేసుకోవడం వల్ల సరిపోదని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలా చేయకపోవడం వల్ల కేవలం దంతాలకు మాత్రమే కాకుండా గుండెకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. అది ఎలాగంటే?
దంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే గుండెకు ఎలా ఇబ్బందులు ఏర్పడతాయని చాలామందికి సందేహం ఉంటుంది. కానీ శరీరంలోని ప్రతి పార్ట్ మిగతా పార్టీతో మిళితమై ఉంటుంది. అలాగే నోటిలోని చిగుర్లు గుండెకు పంపిణీ చేసే రక్తనాళాలతో కనెక్ట్ అయి ఉంటాయి. నోటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోకపోతే.. చిగుర్లు వాపు కు ఏర్పడి లేదా చిగుళ్లలో సమస్యలు వచ్చి అవి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలపై ప్రభావం పడతాయి. నోటిలో క్రిములు ఏర్పడితే ఇవి మెల్లిగా రక్తంలో కలిసే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.
గతంలో చికాగోలో ఉన్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సమావేశంలో పరిశోధనల గురించి కొన్ని వివరాలను బయటపెట్టారు. ఈ అమెరికాలోని 682 మందిని పరిశోధనలోకి తీసుకొని వారిని పరిశీలించారు. రోజుకు ఒకేసారి బ్రష్ చేసుకున్న వారితో పోలిస్తే.. రోజుకు రెండుసార్లు కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకున్న వారి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వీరిలో గుండె పనితీరు మెరుగ్గా ఉన్నట్లు కనుగొన్నారు. బ్రష్ తక్కువ సమయం చేసుకోవడంతోపాటు ఒకేసారి బ్రష్ చేసుకున్న వారిలో గుండెపోటు ప్రమాద తీవ్రస్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నారు.
అందువల్ల దంతాలకు గుండెకు సంబంధం ఉందని వైద్యులు తేల్చారు. వారు చెప్పిన ప్రకారం ప్రతిరోజు కనీసం రెండుసార్లు రెండు నిమిషాలపాటు బ్రష్ చేసుకోవాలని అంటున్నారు. అలా చేయడం వల్ల నోటిలో ఎలాంటి క్రిములు దాగి ఉండవని తెలుపుతున్నారు. దీంతో ఈ క్రిములు రక్తనాళాలకు వెళ్లకుండా బయటకు వెళ్లిపోతాయని అంటున్నారు. బ్రష్ సరిగా చేయలేని వారిలో క్రిములు ఉండిపోయి చిగుళ్ళు వాపు ఎక్కే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ వాపు రక్తనాళాల పై పడి రక్త ప్రసరణ లో ఇబ్బందులు ఏర్పడతాయని తెలుపుతున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొని హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అందువల్ల ఏ విధంగా చూసినా ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమమని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అలవాటు నేర్పాలని వైద్యులు సూచిస్తున్నారు.