Nails Cutting: రాత్రివేళలో గోర్లు కట్ చేస్తే ప్రమాదమా.. పెద్దలు చెబుతున్న ముఖ్యమైన విషయాలివే!

Nails Cutting: మనలో చాలామంది రాత్రి సమయంలో గోర్లు కట్ చేయాలని ప్రయత్నిస్తే అలా చేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. అయితే రాత్రి సమయంలో అలా చేయవద్దని పెద్దలు ఎందుకు చెబుతారో చాలామందికి అర్థం కాదు. ఈతరానికి చెందిన కొంతమంది పెద్దలు మూఢనమ్మకం వల్లే ఆ విధంగా చెబుతున్నారని భావిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి రాత్రి సమయంలో గోర్లను కట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. కెరాటిన్ తో మన గోర్లు నిర్మితమై ఉంటాయి. […]

Written By: Kusuma Aggunna, Updated On : March 30, 2022 4:06 pm
Follow us on

Nails Cutting: మనలో చాలామంది రాత్రి సమయంలో గోర్లు కట్ చేయాలని ప్రయత్నిస్తే అలా చేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. అయితే రాత్రి సమయంలో అలా చేయవద్దని పెద్దలు ఎందుకు చెబుతారో చాలామందికి అర్థం కాదు. ఈతరానికి చెందిన కొంతమంది పెద్దలు మూఢనమ్మకం వల్లే ఆ విధంగా చెబుతున్నారని భావిస్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి రాత్రి సమయంలో గోర్లను కట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.

Nails Cutting

కెరాటిన్ తో మన గోర్లు నిర్మితమై ఉంటాయి. స్నానం చేసిన తర్వాత మనం గోర్లను కత్తిరించడానికి ప్రయత్నిస్తే సులువుగా గోర్లను కత్తిరించవచ్చు. అలా కాకుండా రాత్రి సమయంలో గోర్లను కట్ చేయడానికి ప్రయత్నిస్తే గోర్లు కట్ చేయడానికి కష్టమవుతుంది. ప్రస్తుతం గోర్లను సులభంగా కట్ చేయడానికి నెయిల్ కట్టర్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే పూర్వకాలంలో నెయిల్ కట్టర్లు అందుబాటులో లేవు.

Also Read: Nithin Macherla Niyojakavargam: బర్త్ డే నాడు కత్తి పట్టి వెంటాడిన హీరో ‘నితిన్’

ఆ సమయంలో పదునైన పనిముట్లను, కత్తిని వినియోగించి గోర్లను కట్ చేసేవారు. పూర్వకాలంలో కరెంట్ ఉండేది కాదు కాబట్టి రాత్రి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చేతులు కట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాత్రి సమయంలో గోర్లను కట్ చేయడం కరెక్ట్ కాదని పెద్దలు చెప్పేవాళ్లు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి స్నానం చేసిన తర్వాత గోర్లను కత్తిరించడం ఉత్తమమని వెల్లడించారు.

ఒకవేళ రాత్రి సమయంలో గోర్లు కత్తిరించుకోవాల్సిన పరిస్థితి ఉంటే గోర్లను కొంత సమయం నూనె లేదా నీటిలో ఉంచి కత్తిరించుకుంటే మంచిది. గోర్లు కత్తిరించిన తర్వాత తర్వాత చేతివేళ్లను నీటితో కడిగితే మంచిది. ఆ తర్వాత చేతికి నూనె లేదా మాయిశ్చరైజర్ ను వినియోగిస్తే గోర్లు మరింత మృదువుగా ఉంటాయి.

Also Read: Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: ‘చిరు – చరణ్’ ఎంతసేపు కలిసి ఉంటారో తెలుసా ?