https://oktelugu.com/

Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: ‘చిరు – చరణ్’ ఎంతసేపు కలిసి ఉంటారో తెలుసా ?

Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: మెగాస్టార్ చిరంజీవి, – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రైమ్ లో కలిసి శత్రువుల పై కలిసికట్టుగా ఫైట్ చేస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుంది కదా.. క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆ అద్భుతాన్ని ఆచార్య రూపంలో నిజం చేయబోతున్నాడు. ఆచార్యలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా చ‌ర‌ణ్ పాత్ర‌ ఈ సినిమాలో ఎంతసేపు ఉంటుందో లీక్ అయింది. ఆచార్య‌లో చ‌ర‌ణ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 01:52 PM IST
    Follow us on

    Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: మెగాస్టార్ చిరంజీవి, – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రైమ్ లో కలిసి శత్రువుల పై కలిసికట్టుగా ఫైట్ చేస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుంది కదా.. క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆ అద్భుతాన్ని ఆచార్య రూపంలో నిజం చేయబోతున్నాడు. ఆచార్యలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా చ‌ర‌ణ్ పాత్ర‌ ఈ సినిమాలో ఎంతసేపు ఉంటుందో లీక్ అయింది.

    Ram Charan, Chiranjeevi

    ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండ‌బోతుంది. చిరు – చరణ్ మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్‌ 29న స‌మ్మ‌ర్ కానుక‌గా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ర‌న్ టైం సుమారు 2 గంట‌ల 58 నిమిషాలు ఉండేలా కొర‌టాల ప్లాన్ చేశాడు.

    Also Read: Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు

    మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కాంబినేషన్ చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో చరణ్ అటు వైపు తిరిగి ఉండగా, వెనుక నుండి మెగాస్టార్, చరణ్ భుజం పై చేయి వేస్తోన్న షాట్ ను ఫోటో తీసి రిలీజ్ చేశారు.

    ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు. మెగాస్టార్ నుండి ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదు. దాంతో ఈ నేపథ్యంలో సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారికంగా కొరటాల చూపించబోతున్నాడు. పైగా ప్రస్తుతం మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. కాజల్ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

    Ram Charan, Chiranjeevi

    హీరోయిన్ రెజీనా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. పైగా చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్నిటికీ మించి ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.

    Also Read: Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ

    Tags