
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,81,948కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,104 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3,256 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,71,588 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశంలో ఒకరు చొప్పున కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం మొదలైంది. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో అలజడి రేపుతున్న ఈ కొత్త స్ట్రెయిన్ ఏపీలోనూ పాగా వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ ఈ తరహా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.