https://oktelugu.com/

New SUVs: ఓ ఊపు ఊపేయడం ఖాయం.. త్వరలో మార్కెట్లోకి 3 ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు!

New SUVs స్కోడా తన అద్భుతమైన ఫుల్ సైజ్ ఎస్‌యూవీ కొడియాక్ అప్ డేట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. సెకండ్ జనరేషన్ స్కోడా కొడియాక్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Written By: , Updated On : March 31, 2025 / 06:00 AM IST
New SUVs

New SUVs

Follow us on

New SUVs : భారతీయ వినియోగదారుల్లో ఫుల్ సైజ్ ఎస్‌యూవీలకు నిరంతరం మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో టయోటా ఫార్చ్యూనర్ నుంచి ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి ఎస్‌యూవీలు మంచి ప్రజాదరణ పొందాయి. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త ఫుల్ సైజ్ ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కాస్త ఓపిక పట్టండి. టయోటా నుంచి స్కోడా వంటి ప్రముఖ కార్ల తయారీదారులు రాబోయే రోజుల్లో తమ కొత్త ఫుల్ సైజ్ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాంటి 3 రాబోయే ఫుల్ సైజ్ ఎస్‌యూవీల ఫీచర్ల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం

స్కోడా కొడియాక్ ఫేస్‌లిఫ్ట్

స్కోడా తన అద్భుతమైన ఫుల్ సైజ్ ఎస్‌యూవీ కొడియాక్ అప్ డేట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. సెకండ్ జనరేషన్ స్కోడా కొడియాక్ వచ్చే నెలలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్ డేట్ టో భాగంగా కొత్త కొడియాక్ రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటు క్యాబిన్‌లో కూడా పెద్ద మార్పులను చూడవచ్చు. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండే ఛాన్స్ లేదు.

ఎంజీ మేజిస్టర్
ఎంజీ (MG) భారతీయ మార్కెట్‌లోకి కొత్త ఎస్‌యూవీ మేజిస్టర్‌ను విడుదల చేయబోతోంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఎంజీ మేజిస్టర్‌లో 2.0-లీటర్ 4-సిలిండర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అందించనున్నారు. ఇది 213bhp పవర్, 478Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ మేజిస్టర్ త్వరలో భారతీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్
మరోవైపు, టయోటా ఫార్చ్యూనర్ కూడా కొత్త లుక్ తో భారతదేశంలోకి ప్రవేశించబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ఇండియాలోకి రానుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్‌లో 2.8-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ మూడు ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు భారతీయ మార్కెట్‌లో విడుదలైన తర్వాత ఈ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.