బరువు తగ్గేందుకు కొత్త విధానం.. తీసుకోవాల్సిన ఆహారాలివే..?

దేశంలో చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో కొన్ని ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తే మరికొన్ని ప్రయత్నాలు మాత్రం చెడు ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. డ్యాష్ డైట్ ద్వారా మనం సులభంగా బరువును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. డైటరీ అప్రోచేస్ టూ స్టాప్ హైపర్ టెన్షన్ పేరుతో పిలవబడే ఈ డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. Also Read: ఈ మామిడి తింటున్నారా.. ఆరోగ్య […]

Written By: Kusuma Aggunna, Updated On : March 26, 2021 11:50 am
Follow us on

దేశంలో చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో కొన్ని ప్రయత్నాలు మంచి ఫలితాన్నిస్తే మరికొన్ని ప్రయత్నాలు మాత్రం చెడు ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. డ్యాష్ డైట్ ద్వారా మనం సులభంగా బరువును తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. డైటరీ అప్రోచేస్ టూ స్టాప్ హైపర్ టెన్షన్ పేరుతో పిలవబడే ఈ డైట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Also Read: ఈ మామిడి తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?

డ్యాష్ డైట్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. పండ్లు, కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని డ్యాష్ డైట్ అని అంటాము. ఈ డైట్ లో పండ్లు, కూరగాయలతో పాటు స్వీట్లు, స్నాక్స్ ను కూడా తీసుకోవచ్చు. ఈ డైట్ ద్వారా శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లు డ్యాష్ డైట్ తో పాటు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Also Read: ఎల్లో పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

డ్యాష్ డైట్ ను పాటించే వాళ్లు ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. చక్కెర లేకుండా జ్యూస్ తీసుకోవడంతో పాటు తాజా పండ్లు, కొవ్వు తక్కువగా ఉండే పెరుగును తీసుకోవాలి. పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు స్నాక్స్ లా తీసుకుంటే మంచిది. జంక్ ఫుడ్ కు, ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండాలి. బరువును బట్టి నిపుణుల సూచనల మేరకు డ్యాష్ డైట్ ను తీసుకుంటే మంచిది.

అధిక సంతృప్తికర కొవ్వులు ఉండే ఆహార పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ డైట్ ఉత్తమమైన డైట్ అని తేలింది.