ఏపీ ఎన్నికల బరిలో జనసేన మద్దతుతో బరిలోకి దిగుతున్న బీజేపీ ఎట్టకేలకు నామినేషన్లకు టైం దగ్గర పడుతున్న వేళ తిరుపతి ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసింది. అనూహ్యంగా ఓ మహిళకు అవకాశం ఇచ్చింది. లేడీ బ్యూరోక్రాట్ పేరు ఖరారు చేసినట్టు సమాచారం. మరికాసపేట్లోనే ఆమెను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
కర్ణాటక కేడర్ కు చెందిన తెలుగు మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను తిరుపతి ఎంపీ సీటులో బీజేపీ తరుఫున నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. గతంలో ఈమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో బీజేపీలో చేరారు.
ఏపీలో ఐటీ సెక్రటరీగానూ పనిచేశారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కాషాయజెండాను ఎగురవేయడం ఈజీ అని బీజేపీ భావిస్తోంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా ఏపీ వ్యతిరేక నిర్ణయాలు మైనస్ గా ఉన్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగాయి. బీజేపీలో సందిగ్ధత నెలకొంది.కానీ ఇప్పుడు అభ్యర్థి ప్రకటనతో ఇక రంగంలోకి దిగినట్టు అయ్యింది.
కాగా బీజేపీ తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తాడా రాడా అన్నది ఆసక్తి రేపుతోంది.