విషాదం.. కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి.. ప్రపంచంలోనే తొలిసారి..!

కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. పేద.. ధనిక.. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి ప్రతీఒక్కరిని కబళించి వేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడి మృతిచెందారు. తాజాగా కరోనాతో ఆఫ్రికా దేశంలోని ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని(52) మృతిచెందారు. దీంతో ఆ దేశంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతిపై ఉపప్రధాని థెంబా మసుకు స్పందించారు. […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 7:55 pm
Follow us on

కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరు చెబితేనే ప్రపంచం బెంబెలేత్తిపోతుంది. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. పేద.. ధనిక.. చిన్న.. పెద్ద అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి ప్రతీఒక్కరిని కబళించి వేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడి మృతిచెందారు.

తాజాగా కరోనాతో ఆఫ్రికా దేశంలోని ఎస్వాతీనీ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని(52) మృతిచెందారు. దీంతో ఆ దేశంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతిపై ఉపప్రధాని థెంబా మసుకు స్పందించారు. గత నాలుగు వారాల క్రితం కరోనా టెస్టుల్లో లామిని పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

దీంతో లామిని ఆస్పత్రిలో చేరగా తొలుత కోలుకున్నట్లు కన్పించారని తెలిపారు. అయితే ఆ తర్వాత అనారోగ్యం పాలవడంతో ఈనెల 1న దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో లామిని అర్ధరాత్రి మృతిచెందినట్లు తెలిపారు. ఎస్వాతీనీ ప్రధానిగా ఆంబ్రోస్ మాండ్వులో లామిని 2018లో నియమితులయ్యారని థెంబా తెలిపారు.

ఇప్పటివరకు ఎంతోమంది దేశాధినేతలు కరోనా బారిన పడ్డారు. వీరిలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతోపాటు చాలామంది ఉన్నాయి. అయితే వీరంతా కూడా కరోనాను జయించగా ఎస్వాతీనీ ప్రధాని మాత్రం మృతిచెందడం శోచనీయంగా మారింది.

కరోనాతో మృతిచెందిన తొలి ప్రధానిగా ఆంబ్రోస్ మాండ్వులో లామినే నిలిచారు. కాగా ఎస్వాతీనీలో ఆదేశ ప్రధానియే కరోనాతో మృతిచెందడం విషాదంగా మారింది. 1.2మిలియన్ల జనాభా ఉన్న ఎస్వాతీనీలో ఇప్పటివరకు 6,768కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 127మంది మృతిచెందారు.