https://oktelugu.com/

Food Poisoning:  ఫుడ్ పాయిజనింగ్ అయిందా.. బయటపడేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Food Poisoning: మనలో చాలామంది తినే తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కంటే రుచిగా ఉండే ఆహారానికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. శరీరానికి సూట్ అయ్యే ఆహారం తీసుకున్న సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉండదు. అలా కాకుండా శరీరానికి పడని ఆహారం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. శరీరానికు సూట్ కాని ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2022 / 09:25 AM IST

    food-poisoning

    Follow us on

    Food Poisoning: మనలో చాలామంది తినే తిండి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కంటే రుచిగా ఉండే ఆహారానికే ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. శరీరానికి సూట్ అయ్యే ఆహారం తీసుకున్న సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉండదు. అలా కాకుండా శరీరానికి పడని ఆహారం తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.

    Food Poisoning

    శరీరానికు సూట్ కాని ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య, కడుపులో మంట, విరేచనాలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పుడ్ పాయిజనింగ్ అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. జీలకర్ర, వాము పొడిని నీళ్లలో కలుపుకొని తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.

    వీటితో పాటు అందులో కొంచెం నల్ల ఉప్పును కలిపి తీసుకుంటే మరింత వేగంగా ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. పుడ్ పాయిజనింగ్ అయితే ఆ సమయంలో పెరుగు తీసుకోవడం ద్వారా కూడా సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పెరుగుకు నల్ల ఉప్పును జోడించి తీసుకుంటే మరీ మంచిదని చెప్పవచ్చు. పుడ్ పాయిజన్ అయిన సమయంలో తులసిని తీసుకుంటే ఎంతో మంచిది.

    Also Read: జగన్ కు కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    తులసి టీ తాగినా లేదా పెరుగులో తులసిని కలిపి తీసుకున్నా కూడా ఆరోగ్య సమస్యలు సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. యాపిల్ సైడ్ వెనిగర్ కూడా ఫుడ్ పాయిజనింగ్ సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది. శరీరంలోని చెడు మూలకాలను త్వరగా బయటకు పంపించడంలో వెనిగర్ తోడ్పడుతుంది. నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే సంగతి తెలిసిందే.

    ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్లు నిమ్మకాయ రసం, నల్ల ఉప్పు తీసుకోవడం ద్వారా సమస్యను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియాను దూరం చేయడంలో నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

    Also Read: సీఎంతో టాలీవుడ్ అగ్రహీరోల భేటి.? మొత్తం ఎపిసోడ్ తో తేలిన నీతి ఏంటంటే?