Pawan Kalyan-YS Jagan: పీఆర్సీ విషయంలో మొదలైన లొల్లి ఆంధ్రప్రదేశ్ లో ఆగడం లేదు. మొదట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఉద్యమం చేసినా తరువాత పరిణామాల్లో ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించినట్లు ప్రకటించాయి. దీంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఉద్యోగ సంఘాలు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. కానీ ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఉందని చెబుతూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
ఉపాధ్యాయులను రెచ్చగొట్టేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని నిందలు వేస్తోంది. దీనికి పవన్ కల్యాణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడంతోనే ఉపాధ్యాయులు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో వ్యవహరించడం వల్లే ఈ చిక్కులు వచ్చినట్లు చెబుతున్నారు. కడుపు కాలి వారు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం బలిసి కొట్టుకుంటుందని ఎద్దేవా చేయడం గమనార్హం.
మరోవైపు చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల వెనుక ఉండి వారిని పుషింగ్ చేస్తూ చోద్యం చూస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఏపీలో వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఉపాధ్యాయుల సమ్మెకు ప్రతిపక్షాలపై బురద జల్లే విధంగా మాట్లాడటంపై ఆందోళన నెలకొంటోంది. వారి సమస్యలపై వారు పోరాడితే ఇతరులను బాధ్యులను చేయడం ఎందుకో అర్థం కావడం లేదని నేతలు పేర్కొంటున్నారు.
Also Read: Jagan Tollywood: సీఎంతో టాలీవుడ్ అగ్రహీరోల భేటి.? మొత్తం ఎపిసోడ్ తో తేలిన నీతి ఏంటంటే?
వైసీపీ నేతల తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించడం లేదు. ప్రతిపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అనవసరంగా అభాండాలు వేసే బదులు వారి సమస్యలు తీరిస్తే పోయేది కదా అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.
ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వారి సమస్యలు సావకాశంగా విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ప్రభుత్వమే ఒంటెత్తు పోకడతో వెళుతూ కష్టాలు కొని తెచ్చుకుంటోంది. అనవసర ప్రతిష్టకు అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి వారిని రెండు వర్గాలుగా చేసిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుంది. మొత్తానికి రాష్ట్రంలో పరిణామాలు ఇంకా ఎంత వరకు వెళతాయో తెలియడం లేదు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఏంటి రామానుజాచార్యులపై ఇలా అనేశాడు?