మనలో ప్రతి ఒక్కరూ వంటల్లో కరివేపాకును వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. అయితే కరివేపాకు వంటల్లో వేసినా చాలామంది తినకుండా పడేస్తూ ఉంటారు. కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆ తప్పు అస్సలు చేయరు. కరివేపాకు మనం అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా రక్షించడంతో సహాయపడుతుంది. కరివేపాకు అజీర్ణం సమస్యను దూరం చేస్తుంది. తక్కువ ధరకే కరివేపాకు మనకు మార్కెట్ లో దొరుకుతుంది.
Also Read: పాదాల పగుళ్లను మాయం చేసే ఇంటి చిట్కాలివే..?
జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లకు అద్భుతమైన ఔషధంగా కరివేపాకు పని చేస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకును ఎక్కువగా తీసుకుంటే విరేచనాల సమస్య కూడా తగ్గుతుంది. యూరిన్ మరియు బ్లాడర్ సమస్యలతో బాధ పడే వాళ్లు కరివేపాకు జ్యూస్ ను తీసుకుంటే ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో కరివేపాకు సహాయపడుతుంది.
Also Read: జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించే వంటింటి చిట్కాలివే..?
కరివేపాకుతో చేసిన వంటలు తరచూ తీసుకుంటే రక్తపోటు, రక్తహీనత, డయాబెటిస్ లాంటి సమస్యలు సైతం దూరమవుతాయి. కరివేపాకు క్యాన్సర్ ప్రేరేపిత కారకాలను సైతం సులభంగా నియంత్రించగలుగుతుంది. చెమట, శరీర దుర్వాసన సమస్యలను సైతం తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. ఫుడ్ పాయిజినింగ్ సమస్యను కూడా కరివేపాకు తగ్గిస్తుంది.
మరిన్ని చిట్కాలు కోసం: ఆరోగ్యం/జీవనం
కరివేపాకు జుట్టు మూలాలను బలపరిచి జుట్టు పెరగడంలో సైతం సహాయపడుతుంది. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే కరివేపాకును తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో కరివేపాకు సహాయపడుతుంది. ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి.