https://oktelugu.com/

రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవన విధానంలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల పంట మంచి ధరకే అమ్ముడైనా రైతులకు పెద్దమొత్తంలో లాభాలు రావడం లేదు. అయితే పలు బ్యాంకులు రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సులభంగా రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. Also Read: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.300 చెల్లిస్తే రూ.2 లక్షలు మీ సొంతం..! ప్రభుత్వ రంగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 25, 2020 / 01:23 PM IST
    Follow us on


    దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవన విధానంలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల పంట మంచి ధరకే అమ్ముడైనా రైతులకు పెద్దమొత్తంలో లాభాలు రావడం లేదు. అయితే పలు బ్యాంకులు రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సులభంగా రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

    Also Read: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.300 చెల్లిస్తే రూ.2 లక్షలు మీ సొంతం..!

    ప్రభుత్వ రంగ బ్యాంకులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. యూనియన్ గ్రీన్ కార్డును తీసుకున్న వారికి సులభంగా రుణాలను మంజూరు చేస్తోంది. రైతులు యూనియన్ గ్రీన్ కార్డ్ సహాయంతో 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. రైతులు పంట పండించటం, వ్యవసాయ ఉపకరణాలను కొనుగోలు చేయడం, పిల్లల చదువు, వైద్య ఖర్చుల కొరకు ఈ మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.

    Also Read: భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఏకంగా రూ.1200 పతనం…?

    రైతులకు ఉండే పొలాన్ని బట్టి రుణ ప్రాతిపదిక మారుతూ ఉంటుంది. మూడెకరాల లోపు ఉన్న రైతులు 75,000 రూపాయలు, మూడు నుంచి ఆరు ఎకరాల లోపు ఉన్న రైతులు 2 లక్షల రూపాయలు, 6 నుంచి 8 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు 3 లక్షల రూపాయల రైతులు, 8 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు 5 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశాలు ఉంటాయి.

    మరిన్ని కోసం: ప్రత్యేకం

    రుణం తీసుకున్న రైతులు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీకు కూడా రుణం తీసుకోవాలనే ఆసక్తి ఉంటే సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ ను సంప్రదించి రుణం తీసుకోవచ్చు.