ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

మనలో చాలామంది ఉసిరికాయను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూర్చడంలో ఉసిరి సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే ఔషధ గుణాల వల్ల కొందరు దీనిని ఔషధ రత్నమని చెబుతూ ఉంటారు. ఆయుర్వేద వైద్యంలో సైతం పూర్వీకులు ఎన్నో సమస్యలకు ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. రోజూ ఉసిరిని తినే వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దగ్గు, అల్సర్లను తగ్గించడంలో […]

Written By: Navya, Updated On : December 6, 2020 12:10 pm
Follow us on


మనలో చాలామంది ఉసిరికాయను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఉసిరికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూర్చడంలో ఉసిరి సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే ఔషధ గుణాల వల్ల కొందరు దీనిని ఔషధ రత్నమని చెబుతూ ఉంటారు. ఆయుర్వేద వైద్యంలో సైతం పూర్వీకులు ఎన్నో సమస్యలకు ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

రోజూ ఉసిరిని తినే వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దగ్గు, అల్సర్లను తగ్గించడంలో ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఎవరైతే రోజూ ఉసిరిని తింటారో వారికి శరీరం పటుత్వం కోల్పోకుండా ఉంటుంది. ఉసిరి గుజ్జును తినేవారు బలంగా ఉంటారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంలో ఉసిరి సహాయపడుతుంది. కాలేయం, జీర్ణమండలం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు సైతం ఉసిరి సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఒక స్పూన్ ఉసిరి రసం, తేనెతో కలిపి తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉసిరిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆస్తమా, బ్రోంచైటిస్ వ్యాధులతో బాధ పడే వాళ్లు ఎండిపోయిన ఉసిరితో బెల్లం కలిపి తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు రోజూ ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఆడపిల్లలు రోజూ ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఉసిరి శరీరం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి దెబ్బ తిన్న కణజాలాన్ని వేగవంతంగా బాగు చేయడంలో సహాయపడుతుంది. ఉసిరి మొటిమలను తగ్గించడానికి సైతం ఉపయోగపడుతుంది.