https://oktelugu.com/

బిగ్ బాస్ ట్విస్ట్: షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్.. ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఐదుగురు ఫైనల్ కి వెళ్లనున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలిమినేషన్స్ లో ఉన్న అఖిల్ నిన్న సేవ్ కావడంతో ఆయనకు టికెట్ టు ఫినాలే మెడల్ లభించింది. అఖిల్ సేవ్ కావడంతో ఎలిమినేషన్స్ లో నలుగురు ఉన్నారు. అభిజిత్, హారిక, అవినాష్ మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లో ఉండగా ఒకరు ఎలిమినేట్ […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 12:08 PM IST
    Follow us on


    బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. ఇంటిలో ఉన్న ఏడుగురు సభ్యులలో ఐదుగురు ఫైనల్ కి వెళ్లనున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ ఇప్పటికే ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలిమినేషన్స్ లో ఉన్న అఖిల్ నిన్న సేవ్ కావడంతో ఆయనకు టికెట్ టు ఫినాలే మెడల్ లభించింది. అఖిల్ సేవ్ కావడంతో ఎలిమినేషన్స్ లో నలుగురు ఉన్నారు. అభిజిత్, హారిక, అవినాష్ మరియు మోనాల్ ఎలిమినేషన్స్ లో ఉండగా ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

    Also Read: లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి నో చెప్పిన అనసూయ !

    ఈ నలుగురిలో వీక్ కంటెస్టెంట్ అయిన మోనాల్ హౌస్ నుండి వెళ్ళిపోనుందని నిన్నటి నుండి ప్రచారం జరుగుతుంది. ఐతే అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి ముక్కు అవినాష్ ని బయటికి పంపిస్తున్నారని సమాచారం. అతి తక్కువ ఓట్లు పొందిన అవినాష్ ఇంటి నుండి ఎలిమినేట్ కానున్నాడట. అవినాష్ సైతం గత వారంలో బ్యాడ్ గా ప్రొజెక్ట్ అయ్యారు. అనేక విషయాలలో తనకు సపోర్ట్ గా నిలిచిన అరియనాపై చిన్న చిన్న విషయాలలో గొడవకు దిగడం చేశాడు.

    Also Read: పెళ్లి కుమార్తెగా నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు !

    అలాగే పాలు సేకరించే టాస్క్ లో మోనాల్ తో గొడవ, టాస్క్ నుండి మధ్యలో వెళ్లిపోవడం చేశాడు. బిగ్ బాస్ కూడా ఈ వారం ఎక్కువగా అవినాష్ నెగిటివ్ పాయింట్స్ పైనే ఫోకస్ పెట్టాడు. మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ అవినాష్ కి ఉద్వాసన పలకనున్నాడట. గత వారం ఎలిమినేటై అవిక్షన్ పాస్ ద్వారా బయటపడిన అవినాష్ ప్రేక్షకులపై అసహనం వ్యక్తం చేశారు. కావున మోనాల్ కి బదులు నేడు అవినాష్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్