Ridge Gourd : మనకు ఎండాకాలంలో విరివిగా దొరికే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఇది మంచి పోషకాలు కలిగిన ఆహారం. దీంతో ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ,సి,బి6 ఉండటంతో మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఇంకా పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, కాపర్, జింక్, సోడియం, థైమీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బీరకాయ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ తో రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బి6 విటమిన్ వల్ల మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బీరకాయలో ఉండే ప్రొటీన్ల వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
మలబద్ధకంతో బాధ పడేవారికి ఇది మంచి ఫుడ్. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ తో మనం తిన్న బీరకాయ త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో మలబద్ధకం సమస్య లేకుండా పోతుంది. బీరకాయ రసంలో తేనె కలుపుకుని తాగితే మలబద్ధకం సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఇలా బీరకాయతో మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.
బీరకాయ లోపల ఉండే వ్యర్థాలను, మలినాలను బయటకు పంపుతుంది. అల్కహాల్ లాంటి వాటిని కూడా బయటకు వెళ్లగొడుతుంది. కాలేయం పనితీరు మెరుగుపర్చడానికి బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో బీరకాయను తింటే మన శరీరంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది.
బీరకాయలో ఉండే విటమిన్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండటంతో గుండె పనితీరుకు దోహదపడుతుంది. రక్తనాళాల్లో రక్త సరఫరా బాగుండేలా చేస్తుంది. బీరకాయలో నీరు ఉండటంతో మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మధుమేహం ఉన్న వారి చక్కెర నిల్వలు పెరగకుండా నిరోధిస్తుంది. కళ్ల జబ్బులు రాకుండా చేస్తుంది. ఇలా బీరకాయ తినడం వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.