https://oktelugu.com/

చలికాలంలో జామకాయలు తింటే ఆ సమస్యకు చెక్..?

ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో జలుబు సమస్య ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సాధారణ జలుబు, దగ్గు వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో చలికాలంలో జామకాయలు తింటే ఆరోగ్యానికి లాభమా..? నష్టమా..? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చలికాలంలో జామకాయలు తినడంపై చాలామందిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం చలికాలంలో జామకాయలు తింటే మంచిదని అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. జలుబుతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2020 / 09:39 AM IST
    Follow us on


    ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో జలుబు సమస్య ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సాధారణ జలుబు, దగ్గు వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో చలికాలంలో జామకాయలు తింటే ఆరోగ్యానికి లాభమా..? నష్టమా..? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. చలికాలంలో జామకాయలు తినడంపై చాలామందిలో అనేక సందేహాలు నెలకొన్నాయి.

    అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం చలికాలంలో జామకాయలు తింటే మంచిదని అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. జలుబుతో బాధ పడేవాళ్లు జామకాయ తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని చాలామంది చెబుతుంటారని అయితే అందులో వాస్తవం లేదని తెలుపుతున్నారు. ఆయుర్వేద నిపుణులు జలుబుతో బాధ పడే వాళ్లకు జామ దివ్యౌషధంలా పని చేస్తుందని చెబుతున్నారు.

    శాస్త్రవేత్తలు సైతం జామ కాయలపై పరిశోధనలు చేసి ఇదే తరహా ఫలితాలను వెల్లడించారు. జలుబు సమస్య ఎవరినైనా వేధిస్తే వాళ్లు జామకాయలోని గింజలను తీసేసి తింటే మంచిదని చెబుతున్నారు. జామకాయ తిన్న తర్వాత నీళ్లు తాగాలని అలా చేయడం వల్ల గొంతు, ఊపిరితిత్తుల్లో తగ్గి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని తెలుపుతున్నారు.

    ప్రొఫెసర్ దాయుమనావన్ బాలస్వామి ఇతర పండ్లతో పోల్చి చూస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూర్చడంలో జామ అద్భుతంగా పని చేస్తుందని.. శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయని తెలుపుతున్నారు. అరటి, ఆరెంజ్ తో పోలిస్తే ఈ పళ్ల వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అలాంటి వైరస్ లకు చెక్ పెట్టడంలో జామ అద్భుతంగా పని చేస్తుందని తెలుపుతున్నారు.