https://oktelugu.com/

హరీశ్‌రావును ‘దుబ్బాక’ ఉప ఎన్నిక  టార్గెట్ చేస్తోందా?

దుబ్బాక ఉప ఎన్నిక కోసం సాగుతున్న ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు, వారి తరుపున నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతరెడ్డి కంటే హరీశ్‌రావు ఇక్కడి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరుపున రఘనందన్‌రావుకు ఇతర నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నా.. అభ్యర్థి మాత్రమే హైలెట్‌ అవుతున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉనికిడి పూర్తిగా వినబడడం లేదు. దీంతో […]

Written By: , Updated On : November 1, 2020 / 09:39 AM IST
Follow us on

Dubbaka by-election targeting Harish Rao
దుబ్బాక ఉప ఎన్నిక కోసం సాగుతున్న ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు, వారి తరుపున నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతరెడ్డి కంటే హరీశ్‌రావు ఇక్కడి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరుపున రఘనందన్‌రావుకు ఇతర నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నా.. అభ్యర్థి మాత్రమే హైలెట్‌ అవుతున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉనికిడి పూర్తిగా వినబడడం లేదు. దీంతో ఈ ఫైట్‌ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనే అన్న విషయం అర్థమైంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా అందరూ బీజేపీని టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన హరీశ్‌కు కష్టాలు తప్పవా అన్న సందేహం కలుగుతోంది. దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డప్పటి నుంచి ఇక్కడ గెలుపు ఖాయమేనని, అయితే మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పుకొచ్చారు.

Also Read: తుంగభద్ర పుష్కరాలకు వెళ్లే వారికి అలర్ట్.. వాళ్లకు మాత్రమే అనుమతి..?

కానీ రానురాను బీజేపీ బలపడడంతో స్వల్ప మెజారిటీతో గెలిచినా చాలు.. అన్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ స్వల్ప మెజారిటీతో గెలిస్తే హరీశ్‌రావు సొంత జిల్లాలోనే పట్టు కోల్పోయాడా..? అనే చర్చ సాగనుంది. దీంతో ఇప్పుడు మెజారిటీ విషయాన్ని పక్కనబెట్టి గెలుపుకోసం టీఆర్‌ఎస్‌ కుస్తీ పడుతోందని అంటున్నారు.

Also Read: మంత్రి రాసలీలలు లీక్: అందుకే ఆ మంత్రిని టార్గెట్‌ చేశారా.?

ఇక గతంలో కరీంనగర్‌ ఎంపీ ఎన్నికల్లో కేటీఆర్‌ ప్రసంగిస్తూ..మెజారిటీపై సవాలు చేశారు. అయితే అది బెడిసికొట్టి మెజారిటీ కాదు కదా.. సీటు కూడా రాలేదు. దీంతో మరోసారి మెజారిటీ అనే పదం వాడకుండా అభివృద్ధి చేస్తాం.. అని టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దుబ్బాకలోనూ ఒకవేళ ఎన్నిక ఫలితం తారుమారైతే ఆ అపవాదును హరీశ్‌రావుపైనే నెట్టివేయొచ్చని, అందుకే ఇక్కడ  కేసీఆర్‌ గానీ.. కెటీఆర్‌ గానీ..ప్రచారం చేయడం లేదని అంటున్నారు. ఏదీ ఏమైనా 3 న నిర్వహించే పోలింగ్‌లో దుబ్బాక తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.