https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ ‘జక్కన్న’ తీరులో మార్పు రాలేదుగా..!

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కరోనా ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై పడింది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోవడంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 09:35 AM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్లో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై పడింది. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ‘ఆర్ఆర్ఆర్’లో ఇరుక్కుపోవడంతో ఇండస్ట్రీ నుంచి రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం. ఈ హీరోలతో
    సినిమాలకు కమిట్ అయిన నిర్మాతలు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎప్పుడు పూర్తవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు.

    Also Read: చరణ్ అప్పుడెప్పుడో కొట్టడం మొదలుపెట్టి ఇంకా ఆపలేదు

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి బిజినెస్ పరంగానూ ఒత్తిడి బాగానే ఉంది. దీంతో రాజమౌళి ఈ మూవీని త్వరగా పూర్తి చేస్తాడని అందరూ భావించారు. అయితే రాజమౌళి మాత్రం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఎప్పటిలా సింగిల్ షాట్ కోసం మూడు నుంచి నాలుగు గంటలు వెచ్చిస్తున్నారట.

    Also Read: రజినీ ఇంటి ముందు ధర్నాలు చేస్తే ఏంటి ప్రయోజనం ?

    ఈమేరకు ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావించగా ఇప్పుడు ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని చెబుతున్నాడట. ఇక రాంచరణ్ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడే ఫ్రీ అవుతాడని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు కమిటైన నిర్మాతలు రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నారు. జక్కన్న మాత్రం స్లో అండ్ స్టడీ అంటూ నెమ్మదిగా ‘ఆర్ఆర్ఆర్’ను చెక్కుతుండటం గమనార్హం.