Health benefits of Beer: మద్యపానం హానికరం అని కొంతమంది చెబుతున్నా.. మరోరకంగా ఇది మేలే చేస్తుందని ఇంకొందరు పేర్కొంటున్నారు. మానసిక ఒత్తిడి.. గుండె సమస్యలు లేకుండా ఉండాలంటే రోజు కాస్త మద్యం తాగాలని ఇంకొందరు చెబుతూ ఉంటారు. అయితే ఏదైనా మితిమీరితే ప్రమాదమే అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కానీ మద్యపానం ఎన్నటికైనా హానికరమే అని పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కొందరు చెబుతున్న ప్రకారం.. మద్యం లో .. అందులోనూ బీర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతిరోజు బీర్ తాగని వారు కనీసం వారానికి ఒకసారైనా ఒక గ్లాస్ బీరు తాగాలని పేర్కొంటున్నారు. అసలు బీర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం..
వేసవికాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఎండలో ఉన్నవారు చల్లదనాని కోసం మద్యం అలవాటు ఉన్నవారు లిక్కర్ కాకుండా బీర్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఇతర కాలాల్లో కూడా వారానికి ఒకసారి బీర్ తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని పేర్కొంటున్నారు. వారానికి ఒకసారి బీరు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. బీర్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తొలగిస్తాయి. అలాగే వృద్ధులు వైద్యుల సలహా మేరకు వారానికి ఒకసారి బీర్ తీసుకుంటే వారి జ్ఞాపకశక్తి స్థిరంగా ఉంటుంది. అలాగే అలసట తీరుతుంది.
Also Read: NIA, WHO సిఫార్సులు : ఒక మనిషి రోజూ ఏం తినాలి? ఎంత ఆహారం తీసుకోవాలి?
ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది ఎన్నో రకాల ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఇలాంటివారు మిగతా ఆల్కహాల్ వంటివి కాకుండా బీర్ తాగడం వల్ల ఉపశమనం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బీర్ తాగడం వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్ల పరుస్తుంది. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు అప్పుడప్పుడు బీర్ తీసుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది. ఇందులో ఫైబర్ తో పాటు విటమిన్లు ఉంటాయి. దీంతో కడుపులో ఉండే మలినాలను తొలగిస్తాయని చెబుతున్నారు.
అయితే బీర్ అయినా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరం. ఒకటికి మించి లేదా నాలుగు ఐదు ఒకేసారి బీర్లు తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువగా బీర్లు తాగే వారి శరీరంలో డిహైడ్రేషన్ సమస్య ఉంటుంది. వేసవికాలంలో బీర్లు ఎక్కువగా తాగి ఆహారం తక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మద్యం అలవాటు ఉన్నవారు రోజుకు 1 లేదా వారానికి మూడు బీర్లు తాగడం వరకు ఓకే. అంతకుమించి మద్యం సేవించడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.