మనలో చాలామంది కీర దోసకాయ ముక్కలను ఎంతో ఇష్టంగా తింటారు. కీర దోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పోషకాలు పుష్కలంగా ఉన్న కీర దోసకాయ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ కీర దోసకాయ ముక్కలను తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. కీరదోస కాయ అందం విషయంలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: మునగకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
మనలో చాలామందికి శరీరంలో ఉన్న నీరు చెమట ద్వారా బయటకు వెళుతుంది. చెమట వల్ల శరీరం శక్తిని కోల్పోయే అవకాశంతో పాటు కీర దోసకాయలో ఉండే విటమిన్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడతాయి. కీరదోసను సలాడ్స్ లో భాగం చేసుకుంటే మంచిది. బరువు తగ్గాలని భావించే వాళ్లు కీరదోసను పెరుగులో ముంచుకుని తీసుకుంటే మంచిది. బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు కీరదోస తింటే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: నెయ్యి తింటున్నారా.. నెయ్యి వల్ల కలిగే లాభాలు ఇవే..?
కీరదోస కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో సహాయపడుతుంది. కళ్ల కింద నల్లటివలయాలు, ఇతర కంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు కళ్లపై కీరదోస ముక్కలను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్న కీరదోస వివిధ రకాల క్యాన్సర్స్ లను నివారించడంలో సహాయపడుతుంది. కీరదోస జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో కీర దోసకాయ సహాయపడుతుంది. కీరదోసను తినడం వల్ల గుండె జబ్బులు దూరం కావడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీరదోసలో ఉంచే పీచు జీర్ణశక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. కీర దోసకాయలలో ఉండే విటమిన్ కె ఎముకలను దృఢంగా చేయడంలో తోడ్పడుతుంది.