సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో లభ్యమయ్యే పండ్లలో సపోటా పండ్లు ముందువరసలో ఉంటాయి. సపోటా పండ్లను చికూ అనే పేరుతో కూడా పిలుస్తారు. సపోటా పండ్లు ఎక్కువ కేలరీలను కలిగి ఉండటంతో పాటు రుచిగా ఉంటాయి. సపోటాలో ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి త్వరగా శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. సపోటా పండ్లు అద్భుతమైన రుచితో పాటు అధిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
సపోటాలో విటమిన్ ఏ పుష్కలంలో ఉంటుంది. వృద్ధులు సైతం సపోటా పండును తినడం వల్ల వాళ్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గ్లూకోజ్ ను సమృద్ధిగా కలిగి ఉండే సపోటా తక్షణమే శక్తిని ఇస్తుంది. ఆటలు ఎక్కువగా ఆడేవాళ్లు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. సపోటా పండ్లు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పని చేస్తాయి. వాపు, నొప్పులను తగ్గించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
కొన్ని క్యాన్సర్లను నివారించడంలో సపోటా పండ్లు ఎంతగానో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు సపోటా పండ్లలో పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల పటుత్వాన్ని పెంచడంలో సహాయపడతాయి. సపోటా పండ్లను తీసుకోవడం ద్వారా కాల్షియం, పాస్పరస్, ఐరన్ లభిస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లకు ఆ సమస్యకు చెక్ పెట్టడంతో సపోటా సహాయపడుతుంది.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు సపోటా పండ్లను తీసుకుంటే మంచిది. రక్తస్రావాన్ని తగ్గించడంలో సపోటా పండ్లు సహాయపడతాయి. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న సపోటా పండ్లు వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.