https://oktelugu.com/

క్రేజీ సినిమాకి ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ !

సినిమాకి మాస్ టైటిల్ పెట్టగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్’. కథలు కోసం సంవత్సరంపాటు గింజుకోవడం, టైటిల్ రొటీన్ గా పెట్టడం పూరికి అసలు నచ్చదు. అందుకే టాలీవుడ్ లో పూరి ప్రత్యేకం. పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశాడు. తమ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 18, 2021 / 12:30 PM IST
    Follow us on


    సినిమాకి మాస్ టైటిల్ పెట్టగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్’. కథలు కోసం సంవత్సరంపాటు గింజుకోవడం, టైటిల్ రొటీన్ గా పెట్టడం పూరికి అసలు నచ్చదు. అందుకే టాలీవుడ్ లో పూరి ప్రత్యేకం. పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశాడు. తమ సినిమా టైటిల్ ను ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) అని పూరి బృందం అధికారికంగా ప్రకటించారు.

    Also Read: ప్రభాస్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

    ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ, సునీల్ శెట్టి కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. తండ్రికొడుకుల ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది.

    Also Read: పవన్ -చరణ్ లతో శంకర్ సినిమా.. ఇండస్ట్రీ షేకే !

    విజయ్ సినిమాలో చాల భాగం తండ్రికి వ్యతిరేకంగా పని చేస్తుంటాడట. మరి ఈ తండ్రికొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఆ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై సాంగ్స్ తీయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫైటర్ రూపంలో ఆ అవకాశం రావడంతో అందుకే ఫైటర్ కోసం తెగ కష్ట పడుతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్