Homeలైఫ్ స్టైల్Health Tips: మద్యం తాగకపోయినా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో...

Health Tips: మద్యం తాగకపోయినా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్టే?

Health Tips: మద్యం తాగే అలవాటు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మందు చుక్క వేస్తున్నారు. వేడుక ఎలాంటిదైనా మద్యం తాగడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది. ఈక్రమంలో మద్యం తాగే వారు రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. వారిలో జీర్ణ సంబంధమైన సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. వాటికి సకాలంలో చికిత్స తీసుకోకపో వడంతో అవి ముదిరిపోయి ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటి గురించి ఇప్పటి వరకూ వైద్యులు పలు విధాలుగా అధ్యయనాలు చేసి చెప్పారు. ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఎవరూ ఊహించని విషయాన్ని చెప్పారు. దీంతో చాలా మందిలో భయం మొదలయింది. ఇంతకీ ఏంటి ఆ భయం?

మీరెప్పుడూ మద్యం తాగకపోయినా డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? అయితే మీ ఉదర ఆరోగ్యం పట్ల తస్మాత్‌ జాగ్రత్త. అది ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌’ సమస్య కావొచ్చని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ‘ఆరోగ్య వంతమైన మహిళ, ఆరోగ్యవంతమైన సమాజం’ పేరిట ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో)తో కలిసి ఏఐజీ హాస్పిటల్స్‌ ఓ సదస్సు నిర్వహించింది. ఈసందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి పలు ఉదర సంబంధ వ్యాఽఽధులు. అందుకు దారి తీసే పరిస్థితుల గురించి సోదాహరణంగా వివరించారు. ‘వైద్య శాస్త్రంలో తదుపరి అతి పెద్ద సంచలనంగా గట్‌ మైక్రోబయోమ్‌ నిలువనుందిు. మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణమై, శక్తిగా మారి, శరీరానికి తగిన పోషకాలను అందించేలా చేయడంలో పేగులు కీలకపాత్ర పోషిస్తాయి. పేగుల ఆరోగ్యం సరిగా లేకపోతే మన శరీరంలో ప్రతి అవయవం ప్రభావితమవుతుంది.’ అని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌?

ఈ సందర్భంలోనే ఆయన ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ గురించి చెప్పుకొచ్చారు. ‘ఇటీవల నా స్నేహితుడి కుమార్తె ఒకరు డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారని.. ఎన్నడూ ఆల్కహాల్‌ ముట్టని అమ్మాయి అలా డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడడం నన్ను షాక్‌కు గురిచేసింది. కారణం తెలుసుకోవడానికి ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తే ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌’ ఉన్నట్లు తేలింది. అంటే ఆమె ఉదరం ఓ మైక్రో బ్రూవరీ మాదిరి పనిచేస్తోంది. అదే విషయాన్ని కోర్టుకు తెలిపి ఆ సమస్య నుంచి ఆమె బయటపడింది’ అని నాగేశ్వర్‌ రెడ్డి వివరించారు.

మన కడుపులో రకరకాల బ్యాక్టీరియాలు

మన కడుపులో మంచి, చెడు.. రెండు రకాల బ్యాక్టీరియాలూ ఉంటాయని, వాటితోపాటు 100కు పైగా రకాల సూక్ష్మజీవులు పేగులలో ఉంటాయి. చెడుబ్యాక్టీరియాపై మంచి బ్యాక్టీరియా పైచేయి సాధిస్తే ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే ఇలా ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ సహా పలు సమస్యలు వస్తాయి. మల పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. శస్త్రచికిత్సలు, పిల్లలకు తల్లిపాలు లభించకపోవడం, యాంటీబయాటిక్స్‌ అధికంగా వాడడం వంటి కారణాల వల్ల చెడు బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికే ఇటీవలికాలంలో మల మార్పిడి ప్రక్రియ ఊపందుకుంది..

స్టూల్‌ బ్యాంకులూ వస్తున్నాయి

ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి సేకరించిన మలాన్ని జబ్బుపడిన వ్యక్తి పేగులలో ప్రవేశపెట్టడం ద్వారా.. కొన్ని రకాల మొండి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు స్టూల్‌ (మలం) బ్యాంకులూ వస్తున్నాయి. పెరుగు మంచి బ్యాక్టీరియాకు నిలయం.. వాణిజ్యపరంగా విక్రయించే పెరుగు మాత్రం అంత మంచిది కాదు. ఇంటిలో చేసుకునే పెరుగుతో ప్రయోజనాలుంటాయి అలాగే, పండ్లు, కూరగాయలలో లభించే ప్రో బయాటిక్స్‌ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారు.. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయా మాలు చేస్తున్నా బరువు తగ్గడం లేదంటే చెడు బ్యాక్టీరియానే కారణమని నాగేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular