Nails Health: గోర్లకు స్పర్ష ఉండదు కానీ ఇవి మన చాలా ముఖ్యం. చేతి వేళ్లకు కవచంగా ఉంటాయి. ఇక చూడటానికి అందంగా ఉండేలా వీటికి రంగులు వేయడం లేదా డిజైన్ చేయడం వంటివి చేసుకుంటారు. కొందరు పెద్దగా పెంచుతుంటారు కూడా. ఇదెలా ఉంటే కేవలం అందం కోసం మాత్రమే కాదు శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే ఇవే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. కానీ వాటి గురించి తెలియక లైట్ తీసుకుంటారు చాలా మంది. ఇంతకీ శరీరంలో అనారోగ్య సమస్యలు ఉంటే గోర్లు ఎలా తెలియజేస్తాయో ఓ సారి చూసేయండి.
గోర్ల పై ఎప్పుడు కూడా ఒక నిఘా వేసి ఉంచాలి. వీటిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. శరీరంలో ఏ సమస్య ఉన్నా కూడా గోళ్లపైనే వాటి లక్షణాలు ప్రతిబింబిస్తాయట. ఇందులో మొదటగా గోరు రంగు మెల్లమెల్లగా పసుపు రంగులోకి మారుతుంటుందట. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అని భయపడకండి. ఇదొక లింపెడెమా అనే వ్యాధి వల్ల వస్తుంది. అంతేకాదు కొన్ని సార్లు ఊపిరితిత్తుల సమస్య వల్ల కూడా గోళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుందట.
గోర్లు ఆరోగ్యంగా ఉంటే మృదువుగా కనిపిస్తాయి.లేదా గోరు రంగు లేత గులాబీ రంగులో ఉంటుంది. వయసు పెరిగే కొద్ది గోర్లు పెళుసుగా మారుతుంటాయి. వాటి మెరుపును కూడా కోల్పోతాయి. అయితే శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మాత్రం గోరు రంగులో మార్పులు వస్తాయట. కొన్ని సార్లు చిన్న వయసులో కూడా ఇలా జరుగుతుంది. గోర్లు పలచగా కనిపిస్తే ఐరన్ లోపం ఉందని అర్థం చేసుకోవాలట.
ఫంగల్ ఇన్ఫెక్షన్, హైపర్ థైరాయిడ్ వల్ల కూడా ఇలాంటివి సంభవిస్తాయి. గోరు మీద ఏ బరువు లేకపోయినా సరే గోరు నొప్పి లేకుండా రంగు నల్లగా మారితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే మూత్రపిండాల సమస్యలు ఉన్న వారిలో ఇలా జరుగుతాయట. గోరు రంగు నెమ్మదిగా పసుపు రంగులోకి మారినా సరే వైద్యుడిని సంప్రదించాలి. ఇలా ఉంటే లింపెడెమా అనే వ్యాధి వస్తుందట. అంతేకాదు ఊపిరితిత్తుల సమస్యల వల్ల కూడా గోళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది.