https://oktelugu.com/

Virupaksha: విరూపాక్ష సినిమాలో ఎవరు గమనించని పాయింట్ ఇది

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తం రుద్రవనం అనే ఊరు చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా సరే శాసనాల గ్రంథం లో పరిష్కారం అవుతుందని ఆ ఊరి ప్రజలు ఎక్కువగా నమ్ముతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 4, 2024 12:52 pm
    Virupaksha

    Virupaksha

    Follow us on

    Virupaksha: సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ విరూపాక్ష. ఈ మెగా మేనల్లుడు విరూపాక్ష సినిమాతో ఊహించని రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు.. సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక మిస్టరీ త్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కూడా అదే రేంజ్ లో మెప్పించింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది సినిమా. కానీ ఈ సినిమాలో ఓ లాజిక్ ను మర్చిపోయారు. అదేంటంటే..

    ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తం రుద్రవనం అనే ఊరు చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా సరే శాసనాల గ్రంథం లో పరిష్కారం అవుతుందని ఆ ఊరి ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. కానీ దీని నేపథ్యంలోనే ఎన్నో ట్విస్టులు ఉంటాయి. మొత్తం మీద సినిమాను సూపర్ హిట్ గా చిత్రీకరించారు దర్శకుడు కార్తీక్ దండు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా చేతబడి ఉంటుంది. అదే విధంగా ఫ్లాష్ బ్లాక్ లో హీరోయిన్ తల్లి దండ్రుల మరణానికి కారణం కూడా ఊరి వాళ్ల అజ్ఞానం అని తెలిసిందే.

    ఆ సినిమాలో కలరా వ్యాపించడం వల్ల ఊరిలో చాలా మంది చిన్నారులు మరణిస్తారు. కానీ ఊరి ప్రజలు అజ్జానంతో హీరోయిన్ తల్లిదండ్రులను చంపేస్తారు. ఇక హీరో ఊరిలో స్కూల్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ లోపే ఇవన్నీ జరుగుతాయి. అందుకే క్లైమాక్స్ లో హీరోయిన్ ఇంటిని స్కూల్ గా మార్చాలి అని చెబుతాడు హీరో. కానీ ప్రతి ఒక్కరు భయంతో కాకుండా బాధ్యతగా ఆలోచించాలి అని అంటాడు కూడా. అంటే అందరికి చదువు ఉండాలనేది ఈ సినిమా ఉద్ధేశ్యం అని అర్థం అవుతుంది. చేతబడి, చదువు రెండింటికి లింక్ ఉంటుంది.

    సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ సినిమాగా వచ్చిన ఈ సినిమాతో కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కానీ ఇద్దరికి మంచి హిట్ వచ్చింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కార్తీక్ దండు కి టాప్ బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈయన తదుపరి సినిమా కూడా త్రిల్లర్ జోన్ లోనే ఉండబోతుందట.