Attention Deficit Disorder : చాలామంది వాళ్లకు తెలియకుండానే కొన్ని సమస్యలతో బాధ పడుతుంటారు. కొందరికి అందరిలో మాట్లాడటం, అందరితో కలివిడిగా మాట్లాడ లేకపోవడం వంటి డిజార్డర్స్ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నాయని కూడా కొందరికి తెలియదు. అయితే కొందరు ఒకే దానిపై ఏకాగ్రత పెట్టలేరు. ఇలాంటి వాళ్లకి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సమస్యతో బాధ పడుతున్నట్లు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అని కూడా అంటారు. ఉదాహరణకు కొందరు ఎక్కువగా నగలు ధరించి రెడీ కాలేరు. ఎందుకంటే గంట తరబడి దానికి సమయం కేటాయించి దానిపై ఏకాగ్రతగా ఉండలేరు. ఇలాంటి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉన్నట్లే. అయితే మనలో చాలామందికి ఈ డిజార్డర్ గురించి సరిగ్గా తెలియదు. ఇది ఒక న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్. మరి ఈ డిజార్డర్ లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏంటి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
ఈ లక్షణాలు కనిపిస్తే..
ఈ డిజార్డర్ ఉన్నవారిలో ఎక్కువగా అజాగ్రత్త, దేనిపై దృష్టి పెట్టలేకపోవడం, ఎప్పుడు పరధ్యానంగా ఉండటం, మతిమరుపు, గందరగోళంగా ఉండటం, మనశ్శాంతి లేకపోవడం, టైమ్ ఫాలో కాకపోవడం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేక పోవడం, దేనిని కూడా మ్యానేజ్ చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో మీకు ఏ లక్షణం అయిన కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మేలు. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పనితీరులో మార్పులు రావడం, మెదడు నిర్మాణంలో రావడం, జన్యుపరమైన అంశాలు, పర్యావరణం, నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి కారణాల వల్ల ఈ డిజార్డర్ వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. సమస్యను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే డిజార్డర్ అధికం అయ్యి.. సమస్య ఇంకా పెద్దది అవుతుంది. కాబట్టి ఏ ఒక్క లక్షణం కనిపించిన లేటు చేయకండి.
చికిత్స ఎలా?
వైద్యుని సంప్రదించిన తర్వాత వ్యాధి ఉందని తేలితే.. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. దీనికి చికిత్సగా మందులు ఇస్తారు. అలాగే బిహేవియరల్ థెరపీ చేస్తారు. మనం జీవనశైలిని కూడా మార్చిన ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయాన్నే నిద్ర లేచి, వ్యాయామం చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడంతో పాటు రన్నింగ్ చేయాలి. అలాగే దీనికి తగ్గట్లుగా ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తినడంతో పాటు నిద్రపోవాలి. ఎలాంటి ఒత్తిడికి లోనవుకుండా ఉండాలి. అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు పాజిటివ్‌గా ట్రైన్ చేసుకోవాలి. మీ డైలీ లైఫ్ స్టైల్‌ను ఇలా మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మీకు ఈ డిజార్డర్ సమస్య కూడా తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.