Tonsils: టాన్సిల్స్ వచ్చాయా? నివారణ మార్గాలు సింపుల్..

గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలపి.. ఈ నీటితో ఆవిరి తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. వాపింగ్ చేసేటప్పుడు చెవులు, తలను గుడ్డతో కప్పుకోవడం మర్చిపోవద్దు. దీని వల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం కూడా క్లియర్ అవుతుంది అంటున్నారు నిపుణులు.

Written By: Swathi Chilukuri, Updated On : September 6, 2024 3:53 pm

Tonsils

Follow us on

Tonsils: టాన్సిల్స్ నాలుక వెనుక గొంతుకు ఇరువైపులా గుండ్రంగా ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి నోట్లో ఉండేవే. నోరు, ముక్కు, గొంతు నుంచి ఎలాంటి వ్యాధికారకం శరీరంలోకి ప్రవేశించకుండా ఇవి మీకు సహాయం చేస్తాయి. చాలా మందికి జలుబుతో టాన్సిలిటిస్ ఇన్ఫెక్షన్‌ తలెత్తుతుంది అంటున్నారు నిపుణులు. చాలా అరుదుగా ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ కొద్ది మందిలో మాత్రమే వస్తుంది. అయితే దీని నుంచి ఎలా బయటపడాలో కూడా చాలా మందికి తెలియదు. అయితే, టాన్సిల్ నొప్పిని ఇంటి టిప్స్ తో కూడా నివారించుకోవచ్చు. మరి అదెలా అంటే?

గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలపి.. ఈ నీటితో ఆవిరి తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. వాపింగ్ చేసేటప్పుడు చెవులు, తలను గుడ్డతో కప్పుకోవడం మర్చిపోవద్దు. దీని వల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మం కూడా క్లియర్ అవుతుంది అంటున్నారు నిపుణులు.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె, ఉప్పు కలపి తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. టాన్సిల్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఈ పానీయం చాలా సహాయం చేస్తుంది. ఈ నిమ్మకాయ నీటిని రోజుకు 3-4 సార్లు తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

టాన్సిల్ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ టీ తోడ్పడుతుంది అంటున్నారు నిపుణులు. గ్రీన్ టీలో కాస్తింత తేనెలో కలుపుకుని రోజుకు 3 సార్లు తాగాలి. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టాన్సిల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంటాయి. గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు పొడిని కలిపి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలం. ఇవి టాన్సిల్ నొప్పి, ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంటాయి.

పసుపు కలిపిన పాలు తాగితే జలుబు, దగ్గు మాయం అవుతాయి. టాన్సిల్ సమస్యతో బాధపడుతుంటే వెజిటేబుల్ లేదా చికెన్ సూప్‌ వేడివేడిగా తాగడం వల్ల కూడా మెడకు విశ్రాంతి లభిస్తుంది. అలాగే జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. టాన్సిల్ నొప్పి కూడా పోతుంది. ఇవి మాత్రమేకాదు ఉల్లిపాయల నుంచి ఆవాల వరకు, టాన్సిల్ల్సిటిస్ చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని ఆయుర్వేద నివారణల గురించి కూడా తెలుసుకుందాం.

ఉల్లిపాయలు టాన్సిలిటిస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సహాయపడుతాయి. ఇందులో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అర కప్పు నీటితో ఉల్లిపాయల మిశ్రమాన్ని తాగండి. మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు: మెంతిలోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. దాని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు టాన్సిల్స్ వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంటాయి. మెంతులు గొంతులోని కఫాన్ని విచ్ఛిన్నం చేస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఆవాలలోని మెగ్నీషియం మూలకం ఉంటుంది. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ప్రదర్శిస్తుంటాయి. టాన్సిల్స్ లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి ఈ ఆవాలు. ఆవాల పొడి ఒక గ్లాసు వేడి నీళ్ల మిశ్రమంతో పుక్కిలించాలి అంటున్నారు నిపుణులు.