https://oktelugu.com/

Game Changer: ‘గేమ్ చేంజర్’ నుండి రేపు సెన్సేషనల్ అప్డేట్..అభిమానుల ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే!

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాల్సిందిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఒక నెగటివ్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : September 6, 2024 / 03:33 PM IST

    Game Changer Trailer

    Follow us on

    Game Changer: #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ శంకర్ కి ఇండియన్ 2 చెయ్యాల్సి రావడంతో గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ఇటీవలే పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా గడుపుతున్న మూవీ యూనిట్ త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉండగా రేపు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఈ విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించనున్నారు.

    ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాల్సిందిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఒక నెగటివ్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ గురించి మూవీ టీం వరకు వెళ్ళింది, థమన్ బాధపడుతూ ఒక పెద్ద ట్వీట్ కూడా వేసాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ దెబ్బకి మూవీ టీం దిగొచ్చి మొత్తానికి రేపు విడుదల తేదికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక్క పాట మాత్రమే విడుదల చేసారు. ఆ పాట కూడా విడుదలకు ముందే లీక్ కి గురైంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా రాకపోవడం అభిమానులను ఒక విధంగా తీవ్రమైన అసహనం కి గురి అయ్యేలా చేసింది. అయితే ఎట్టకేలకు మంచి విడుదల తేదీని ఫిక్స్ చేసినందుకు అభిమానులు సంతోషిస్తున్నారు.

    కానీ ఈ సినిమా విడుదల రోజే ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి సమస్య ఉండదు కానీ, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం గేమ్ చేంజర్ కి షోస్ బాగా తగ్గే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో కూడా షోస్ విషయం లో పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. లయన్ కింగ్ తో పాటు ‘పుష్ప : ది రూల్’ చిత్రం కూడా ‘గేమ్ చేంజర్’ కి అడ్డుగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ‘పుష్ప: ది రూల్’ చిత్రం డిసెంబర్ 6 వ తేదీన విడుదల కానుంది, ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే గేమ్ చేంజర్ కి పలు షోస్ తగ్గే అవకాశం ఉంటుంది.