RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… ఈసారి డాన్స్ తో రఫ్ఫాడించనున్న ఎన్టీఆర్, చరణ్

RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 6, 2021 7:09 am
Follow us on

RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. కాగా తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

కాగా తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను నవంబర్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు  రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్న ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.  “నాటు నాటు” అనే లిరిక్స్ తో ఈ పాట ఉండబోతోంది. డాన్స్ విషయానికి వస్తే టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. వారి గత సినిమాల్లో తమదైన డాన్స్ లతో వారు ఇరువురు దుమ్ముదులిపారు. ఇప్పుడు ఒకే పాటలో వీరిద్దరు కలిసి ఏ రేంజ్ లో అలరిస్తారో అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కో అప్డేట్ తో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

https://twitter.com/RRRMovie/status/1456647011491475458?s=20