ఏపీ ప్రజలకు శుభవార్త… భారీగా తగ్గిన కరోనా మరణాలు..?

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో 10,000కు అటూఇటుగా కరోనా కేసులు 70కు అటూఇటుగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు జిల్లాల్లో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,657 కేసులు నమోదు కాగా 7 మంది మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం […]

Written By: Navya, Updated On : November 14, 2020 7:52 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో 10,000కు అటూఇటుగా కరోనా కేసులు 70కు అటూఇటుగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు జిల్లాల్లో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,657 కేసులు నమోదు కాగా 7 మంది మృతి చెందారు.

కరోనా మరణాల సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో వైరస్ ను కట్టడి చేయడం కష్టం కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,52,955 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,26,344 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,757గా ఉండగా ఇప్పటివరకు 6,854 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

జగన్ సర్కార్ రాష్ట్రంలో ప్రతిరోజూ 80,000కు అటూఇటుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పుగోదావరి, చిత్తూరు, గుంటూరు, కృష్ణ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 100 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటివరకు 90 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

అయితే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లేకపోతే మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా నుంచి కాపాడుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.