https://oktelugu.com/

మిర్చీ తినడం హెల్త్ కు మంచిదేనా.. సర్వేలో షాకింగ్ విషయాలు..?

మిర్చీ తినే విషయంలో చాలామంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కొంచెం పచ్చిమిర్చిని కరకరా తినేస్తే మరి కొందరు పచ్చి మిరపను చూస్తే భయపడుతూ ఉంటారు. కొద్దిగా తిన్నా కారంగా ఉందని తమ వల్ల కాదని చెబుతూ ఉంటారు. మరి మిర్చీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా…? అని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాకు చెందిన ఓ సంస్థ మిర్చీ శరీరంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2020 / 07:58 PM IST
    Follow us on


    మిర్చీ తినే విషయంలో చాలామంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కొంచెం పచ్చిమిర్చిని కరకరా తినేస్తే మరి కొందరు పచ్చి మిరపను చూస్తే భయపడుతూ ఉంటారు. కొద్దిగా తిన్నా కారంగా ఉందని తమ వల్ల కాదని చెబుతూ ఉంటారు. మరి మిర్చీని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా..? కాదా…? అని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    అమెరికాకు చెందిన ఓ సంస్థ మిర్చీ శరీరంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మిర్చీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని మిర్చీ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపింది. మిర్చీ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చి మిర్చీ పలు వ్యాధులను సైతం దూరం చేస్తుందని వెల్లడించారు.

    రోజూ పచ్చి మిర్చీ తినే వాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని తెలిపారు. ఇటలీ, అమెరికా దేశాలతో పాటు పలు దేశాల నుంచి చేసిన సర్వేల ద్వారా మిర్చీ తినేవాళ్లలో గ్లూకోజ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని తేలింది. అయితే వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

    అయితే అతిగా పచ్చిమిర్చి తీసుకుంటే మాత్రం పలు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయని.. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వ్యాధులతో బాధ పడుతుంటే ఆ వ్యాధులను పచ్చి మిర్చీ తగ్గిస్తుందని మాత్రం చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.