https://oktelugu.com/

వాహనదారులకు ఝలక్.. కొత్త వాహనం కొనాలంటే చుక్కలే..?

దేశంలో రోజురోజుకు ప్రజల ఆదాయం పెరగకపోయినా ఖర్చులు పెరుగుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో బీఎస్ 4 వాహనాలు ప్రజలకు తక్కువ మొత్తానికే అందుబాటులోకి వచ్చేవి. అయితే కేంద్రం బీఎస్ 6 వాహనాలను మాత్రమే అమ్మాలని నిబంధనలను మార్చిన నేపథ్యంలో వాహన ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేసే బదులు పాత వాహనాలనే సెకండ్ హ్యాండ్ లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2020 / 07:44 PM IST
    Follow us on


    దేశంలో రోజురోజుకు ప్రజల ఆదాయం పెరగకపోయినా ఖర్చులు పెరుగుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో బీఎస్ 4 వాహనాలు ప్రజలకు తక్కువ మొత్తానికే అందుబాటులోకి వచ్చేవి. అయితే కేంద్రం బీఎస్ 6 వాహనాలను మాత్రమే అమ్మాలని నిబంధనలను మార్చిన నేపథ్యంలో వాహన ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి.

    దీంతో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేసే బదులు పాత వాహనాలనే సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ తరువాత సెకండ్ హ్యాండ్ వాహనాలకు డిమాండ్ సైతం భారీగా పెరిగింది. దీంతో గతేడాదితో పోలిస్తే వాహనాల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ సర్కార్ వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తే మాత్రమే మళ్లీ వాహన విక్రయాలు పుంజుకుంటాయని చెప్పవచ్చు.

    టూ వీలర్లపై, ఫోర్ వీలర్లపై జీఎస్టీ తగ్గిస్తే మాత్రమే వాహనాల రేట్లు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. జీఎస్టీ ధరలను తగ్గించడం ద్వారా కేంద్రం ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టీవీలర్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. డీలర్లు వాహనాలను 28 శాతం కంటే తక్కువ శ్లాబ్ లో ఉంచితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు వాహన ధరలు తగ్గే అవాకాశం ఉంది. కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని వాహనదారులు కోరుతున్నారు. మరి కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.