Health Tips : జుట్టు మార్పిడి చేయించుకుంటున్నారా? తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే..

ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి, జుట్టు పొందే వ్యక్తి జుట్టు నాణ్యతపై ఆధారపడి ఫలితం ఉంటుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత జుట్టు రాలడం ప్రారంభమైతే కొందరు వెంటనే ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయం వల్ల జుట్టు సహజంగా పెరిగే జుట్టు మీద ప్రభావం పడుతుంది.

Written By: Swathi, Updated On : July 27, 2024 10:14 pm
Follow us on

Health Tips : వాతావరణం, కాలుష్యం, జీవనశైలి మార్పుల వల్ల స్త్రీ, పురుషులందరూ జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు కూడా విఫలం అవుతున్నాయి. తెల్ల వెంట్రుకలు, జుట్టు చిట్లడం, రాలడం వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్ని సార్లు నూనెలు కూడా మంచి పరిష్కారాలను అందిస్తాయి. మరొకొన్ని సార్లు ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్స్ కూడా మీకు మంచి రిజల్ట్ ను అందిస్తాయి. కానీ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే మరింత జుట్టు రాలే సమస్య కూడా పెరగవచ్చు. ఇదంత పక్కన పెడితే అయితే ఆధునిక పద్ధతులు మాత్రం మానవ సమస్యలను పరిష్కరిస్తున్నాయి. జేబులో డబ్బులుంటే రాలిన పండ్ల నుంచి ఊడిన జుట్టు వరకు ప్రతి ఒక్కటి ఉండాల్సిన ప్లేస్ లో ఉంటుంది. చాలా మంది ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ పద్ధతిలో పోయిన జుట్టును మళ్లీ తిరిగి పొందుతున్నారు. అయితే మార్పిడి చేసుకోవడం మాత్రమే కాదు ఇందులో కొన్ని నియమాలు కూడా పాటించాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి సమస్య ఉండదు. డెర్మటాలజిస్ట్, గ్లోబల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ బోర్డ్ సర్జన్ డా అమరేంద్ర కుమార్‌ ఈ సమస్యకు సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు.

ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వ్యక్తి, జుట్టు పొందే వ్యక్తి జుట్టు నాణ్యతపై ఆధారపడి ఫలితం ఉంటుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత జుట్టు రాలడం ప్రారంభమైతే కొందరు వెంటనే ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ చేయించుకోవాలని అనుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయం వల్ల జుట్టు సహజంగా పెరిగే జుట్టు మీద ప్రభావం పడుతుంది. అందుకే ఈ సమయంలో కాస్త సహజమైన పద్దతుల ద్వారా జుట్టును పెంచుకోవడం ఉత్తమం.

జుట్టు మార్పిడికి అనువైన వయస్సు: ఏ వయస్సులో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. సరైన వయస్సులో మార్పిడి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ 25 సంవత్సరాల నుంచి ప్రారంభించవచ్చట. ఇక చివరగా 75 సంవత్సరాల వరకు కూడా చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కు దూరంగా ఉండాలి. ఇదిలా ఉంటే 25 సంవత్సరాల కంటే ముందు మాత్రం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే భవిష్యత్తులో దుష్పరిణామాలు ఎదురవుతాయి. అంతేకాకుండా జుట్టు ఎక్కువగా రాలుతుంది.35-36 ఏళ్లలోపు ‘హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్’ చేసుకోవడం మరింత మంచిది. ఎందుకంటే ఈ సమయంలో జుట్టు రాలడం స్పష్టంగా కనిపిస్తుంది.

పురుషులకు 30 – 45 సంవత్సరాల మధ్య జుట్టు రాలే సమస్య ప్రారంభం అవుతుంది. మహిళల్లో ఈ ధోరణి హార్మోన్ల మీద ఆధారపడుతుంది. ప్రధానంగా మెనోపాజ్ తర్వాత అంటే 40, 50 సంవత్సరాల తర్వాత లేదా 60 సంవత్సరాల తర్వాత ఈ దశ ప్రారంభం అవుతుంది అంటున్నారు నిపుణులు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చిన్న వయస్సులో చేయకూడదు. అదే విధంగా వృద్ధాప్యంలో కూడా చేయకూడదు. సరైన వయస్సు 25 – 70 మధ్య ఉంటుంది. మరీ ముఖ్యంగా 35 తర్వాత చేయించుకోవడం, 50 తర్వాత ముగించుకోవడం మరీ మంచిది.

లేదంటే యువకులకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన దేశంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. 2025 నాటికి 140 మిలియన్ల మంది వరకు చేరవచ్చు అంటున్నారు నిపుణులు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్లు రీజనబుల్ ధరల్లో లభ్యం అవుతుంది కాబట్టి మరింత ఎక్కువ మంది పెరుగుతున్నారు. అన్ని దేశాల కంటే అమెరికా, టర్కీ, దక్షిణ కొరియా ముందున్నాయి.