pregnant women : చాలామందికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకున్నట్లుగా వీటిని చూసుకుంటారు. సాధారణంగా చాలా మంది కుక్కను లేదా పిల్లిని ఎక్కువగా పెంచుకుంటారు. మనుషులను నమ్మడం కంటే పెంపుడు జంతువులను నమ్మడం మేలని, వీటికి విశ్వాసం ఉంటుందని పెంచుకుంటారు. అయితే పెంపుడు జంతువులను పెంచుతున్నట్లయితే కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణులు పెంపుడు జంతువులకు కాస్త దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల వల్ల గర్భిణులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. గర్భిణులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెంపుడు జంతువులు ఉంటే అన్ని సార్లు ఆరోగ్య విషయంలో అంత జాగ్రత్త ఉండదు. వాటితో కలిసి ఉండటం వల్ల ఆటోమెటిక్‌గా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి పెంపుడు జంతువులకు గర్భిణులు కాస్త దూరంగా ఉండటం మంచిది.
కుక్కలకు దూరంగా..
పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కను పెంచుకుంటారు. కుక్క వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. కుక్క లాలాజలం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని నయం చేయడం చాలా కష్టం. దీనివల్ల గర్భిణులకు పిండం మీద ప్రభావం పడుతుంది. కొందరు అయితే వాటిని పట్టుకుని, పడుకుని ఉంటారు. దీనివల్ల గర్భిణులకు చాలా ప్రమాదం. కాబట్టి గర్భిణులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
పిల్లులు..
పిల్లులను పెంచుకోవడం వల్ల అవి ఒక్కోసారి ఇంట్లో మలాన్ని విడుదల చేస్తాయి. దీనిలో టాక్సోప్లాస్మోసిస్ అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భానికి శత్రువు. దీనివల్ల పిండానికి హాని కలుగుతుంది. ఈ పరాన్న జీవి వల్ల శరీరంలో విపరీతమైన జ్వరం, తలనొప్పి, శరీరంలో నొప్పి వంటివి కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో పిల్లుల జోలికి పోవద్దు. పిల్లిని చూసుకునే బాధ్యతను ఇతరులకు అప్పగించండి.
ఎలుకలు..
ఎలుకలు వంటి జంతువుల్లో లింఫోసైటిక్ కోరియోమెనింజైటిస్ అనే వైరస్ ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు ఎలుకలతో ఉంటే ఆ వైరస్ వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. అలాగే పుట్టే బిడ్డలో లోపాలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. పొరపాటున వాటిని ముట్టుకున్న కూడా వెంటనే చేతులు అన్ని శుభ్రం చేసుకోవాలి.
పక్షులు
సాధారణంగా పక్షులు బోనుల్లో ఉంటాయి. వీటివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవని అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా సాల్మోనెల్లా, క్లామిడియోసిస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటివల్ల గర్భస్రావం, పుట్టిన బిడ్డ మరణించడం జరుగుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో పెంపుడు జంతువులకు కాస్త దూరంగా ఉండండి. దీనివల్ల పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.