Eyesight: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే ఆ చూపు సరిగా ఉంటేనే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆ చూపు పొరపాటున ప్రమాదంలో పడటం, లేదా మందగిస్తే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ చూపును మెరుగుపరిచే పదార్థాలు ఏమిటో ఓసారి ఈ కథనంలో తెలుసుకుందాం.
క్యారెట్
క్యారెట్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న “విటమిన్ ఏ” రెటీనా సజావుగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
పాలకూర
ఇందులో లూటిన్, జియాక్సింతిన్ అనే యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన కాంతి నుంచి కళ్ళను కాపాడుతాయి. వయస్సు సంబంధిత కంటి శుక్లాల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి.
కాలే
ఇందులో లూటిన్, జియాక్సింతిన్, విటమిన్ సీ, బీటా కెరోటిన్ వంటివి మెండుగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. రెటీనా పనితీరుకు ఆటంకాలు కలగకుండా చూస్తాయి.
సాల్మన్
సాల్మన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పొడికళ్లు, కంటి శుక్లాలను నిరోధించడంలో తోడ్పడుతుంది.
గుడ్లు
ఇందులో లూటిన్, జియాక్సింతిన్, జింక్ అధికంగా ఉంటాయి.. ఇది కళ్ళ పనితీరును మెరుగుపరుస్తాయి. చూపు ఉత్తేజితంగా మారటానికి దోహదం చేస్తాయి.
బ్లూ బెర్రీస్
ఇందులో అంధో సైనిన్స్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో చూపును మెరుగుపరుస్తాయి. కంటి శుక్లం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తాయి.
బాదం
ఇందులో “విటమిన్ ఈ” ఉంటుంది. వయసుతో వచ్చే ప్రీ రాడికల్స్ సమస్యను ఇది నిరోధిస్తుంది. కళ్ళను రక్షించడంలో తోడ్పడుతుంది.
నారింజ పండ్లు
ఇందులో “విటమిన్ సీ” అధికంగా ఉంటుంది. దీనివల్ల కళ్ళకు రక్త సరఫరా మెరుగ్గా అవుతుంది. రక్తనాళాలను పరిరక్షిస్తుంది.. వయసు వల్ల వచ్చే నేత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది.
చిలగడ దుంపలు
ఇందులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటికి బలాన్ని ఇస్తుంది. ఇందులో “విటమిన్ ఏ” చూపును మెరుగుపరుస్తుంది. కంటి శుక్లాలు రాకుండా నిరోధిస్తుంది.