https://oktelugu.com/

చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ మారదా?.. అప్పటి వరకు ఉత్తమే టీపీసీసీ చీఫ్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగువెలిగింది. ఓసారి ఓడినా.. ఓసారి గెలుస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆపార్టీ ఎన్నడూ బలహీన పడలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాత్రం కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. గత ఆరేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గల్లీ స్థాయికి పడిపోయింది. Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. జానారెడ్డికి జాక్ పాట్..! రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పోటీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 09:56 PM IST
    Follow us on


    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓ వెలుగువెలిగింది. ఓసారి ఓడినా.. ఓసారి గెలుస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఆపార్టీ ఎన్నడూ బలహీన పడలేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాత్రం కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. గత ఆరేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గల్లీ స్థాయికి పడిపోయింది.

    Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. జానారెడ్డికి జాక్ పాట్..!

    రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చిన దాఖలు లేవు. అసెంబ్లీ.. పార్లమెంట్.. మున్సిపల్.. పంచాయతీ.. సహకార.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్నా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికలను పరిశీలిస్తే అసలు కాంగ్రెస్ రేసులో ఉందా? అన్న సందేహాలు ప్రతీఒక్కరిని రాక మానదు.

    కాంగ్రెసులో సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే నేతలు ఎన్నాడూ పార్టీ భవిష్యత్ గురించి పట్టించుకున్న దాఖలేవు. సొంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టించుకున్న పాపానా పోలేదు. ఎన్నికలప్పుడు తప్ప కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదు. దీంతో ప్రజలు సైతం వీరిని పట్టించుకోవడం మానేశారు.

    తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమాత్రం వినియోగించుకోలేక చతికిలపడుతోంది. కాంగ్రెస్ నేతలు ఎంతసేపు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతుండటంతో ప్రజలు సైతం ఆపార్టీ నేతలపై విసుగు చెందుతున్నారు. దీంతో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు క్రమంగా బీజేపీ మరలుతోంది. దీంతో బీజేపీ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారుతోంది.

    Also Read: దూసుకెళ్తున్న ‘బండి’.. వీర్రాజుకు సవాల్

    ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ స్థానంలో సరైన అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఆపార్టీ దయనీయ స్థితికి అద్ధం పడుతోంది. అందరి ఏకాభిప్రాయం తీసుకొని టీపీసీసీ ప్రకటిస్తామని చెబుతున్నా అది కాంగ్రెస్ లో సాధ్యమయ్యేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

    గ్రూపు రాజకీయాలకు.. లాబీయింగ్ లకు కేరాఫ్ గా నిలిచే కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నియామకంపై పక్కదారి పడుతున్నట్లు కన్పిస్తోంది. ఈ కారణంగానే టీపీసీసీ ప్రకటన ఆలస్యం అవుతుందనే టాక్ విన్పిస్తోంది. టీపీసీసీ ప్రకటన రాగానే కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండటంతో అధిష్టానం అచితూచి అడుగులు వేస్తోంది. దీంతోనే కొత్త టీపీసీసీ ఎన్నికయ్యే వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా ఉంటారని అధిష్టానం చెబుతోంది.

    ఇప్పటికే గల్లీ స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ లో కొందరు నేతలు వెళితే పెద్దగా వచ్చే ప్రమాదమేమీ లేదని ఆ పార్టీలోని నేతలు చెబుతుండటం విశేషం. ఇకనైనా కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని టీపీసీసీ ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం రేసులోనైనా నిలుస్తుందని అంటున్నారు. లేనట్లయితే కాంగ్రెస్ ను ఆ దేవుడు కూడా కాపాడలేరని పలువురు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్